ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ప్రమాదం... ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం


· పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 8:36PM by PIB Hyderabad

మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ఈ రోజు జరిగిన ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. లక్షల పరిహారాన్ని అందిస్తాం. క్షతగాత్రులకు రూ. 50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodi”  


(రిలీజ్ ఐడి: 2224762) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam