ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల సుంకం విధించే వస్తువులపై


పన్ను శాతాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింపు

రోగుల కోసం, ముఖ్యంగా క్యాన్సర్ రోగుల కోసం 17 రకాల మందులపై

ప్రాథమిక కస్టమ్స్ పన్ను నుంచి మినహాయింపు

వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే మందులు, ఎఫ్ఎస్ఎంపీలపై

పన్ను మినహాయింపు ఇచ్చే జాబితాలో చేర్చనున్న మరో ఏడు అరుదైన వ్యాధులు

టైర్ 2, టైర్ 3 అధీకృత ఆర్థిక నిర్వాహకులకు పన్ను చెల్లింపు గడువును

15 రోజుల నుంచి 30 రోజులకు పెంపు

ఎలక్ట్రానిక్ సీలింగ్ ఉపయోగించే ఎగుమతి వస్తువులకు ఫ్యాక్టరీ నుంచి ఓడ వరకు క్లియరెన్స్ సౌకర్యం

प्रविष्टि तिथि: 01 FEB 2026 1:01PM by PIB Hyderabad

పార్లమెంటులో నేడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టే సందర్భంగా కస్టమ్స్కేంద్ర ఎక్సైజ్ ప్రతిపాదనల గురించి కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారుపన్నుల నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేయడానికిదేశీయ తయారీ రంగానికి మద్దతు ఇవ్వడానికిఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడానికిపన్నుల రూపకల్పనలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

జీవన సౌలభ్యం
కస్టమ్స్ సుంకాలను క్రమబద్ధీకరించడానికివ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే పన్ను పరిధిలోకి వచ్చే అన్ని వస్తువులపై విధించే పన్నుల శాతాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని బడ్జెట్ ప్రతిపాదించిందిరోగులకుముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా 17 రకాల ఔషధాలుమందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించిందివ్యక్తిగత చికిత్సకు ఉపయోగించే మందులుఔషధాలుప్రత్యేక వైద్య అవసరాల కోసం ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం మినహాయింపు ఇచ్చే జాబితాలో మరో అరుదైన వ్యాధులను చేర్చాలని బడ్జెట్ ప్రతిపాదించింది.

 

అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బ్యాగేజీ క్లియరెన్స్‌ కు సంబంధించిన నిబంధనలను సవరించాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించిందిఈ సవరించిన నిబంధనల ప్రకారం సుంక రహిత భత్యాలను పెంచడంతోపాటు వస్తువులను తాత్కాలికంగా దేశంలోకి తీసుకురావడం లేదా బయటకు తీసుకెళ్లడంపై మరింత స్పష్టతను అందిస్తుందినిజాయితీగల పన్ను చెల్లింపుదారులు ఇకపై జరిమానాకు బదులుగా అదనపు మొత్తాన్ని చెల్లించితమ బకాయిలను పరిష్కరించుకోవడానికికేసులను ముగించుకోవడానికి వీలు కలుగుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

కస్టమ్స్ ప్రక్రియ

వస్తువుల రవాణా వేగంగాసులభంగా సాగడానికివాణిజ్యానికి మరింత భరోసా కల్పించడానికి కస్టమ్స్ ప్రక్రియల్లో అధికారులకు కనీస జోక్యం ఉండేలా బడ్జెట్ పలు చర్యలను ప్రతిపాదించింది.

నమ్మకంపై ఆధారపడిన వ్యవస్థలు

ఏఈఓలుగా పిలిచే టైర్-2, టైర్-3 అధీకృత ఆర్థిక నిర్వహకులకోసం పన్ను చెల్లింపు గడువును ప్రస్తుతం ఉన్న 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించిందిఅర్హత కలిగిన తయారీదారు-దిగుమతిదారులకు అదే సుంకం వాయిదా సౌకర్యాన్ని అందించాలని బడ్జెట్ ప్రతిపాదించిందితద్వారా వారు పూర్తి స్థాయి టైర్ 3- ఏఈఓగా గుర్తింపు పొందేలా ప్రోత్సహించాలని కూడా బడ్జెట్ ప్రతిపాదించింది.

కస్టమ్స్ నిబంధనలకు కట్టుబడి ఉండే ‘అడ్వాన్స్ రూలింగ్’ కాలపరిమితిని ప్రస్తుతం ఉన్న సంవత్సరాల నుంచి సంవత్సరాలకు పెంచాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించిందిప్రభుత్వ సంస్థలు తమ వస్తువుల క్లియరెన్స్‌లో ప్రాధాన్యత పొందడానికి ఏఈఓ గుర్తింపును ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తామని బడ్జెట్ పేర్కొందినమ్మకమైనదీర్ఘకాలిక సరఫరా వ్యవస్థను కలిగి ఉన్న సాధారణ దిగుమతిదారులను రిస్క్ వ్యవస్థ గుర్తిస్తుందిదీనివల్ల ప్రతిసారీ వారి వస్తువులను తనిఖీ చేయాల్సిన అవసరం తగ్గుతుందిఎలక్ట్రానిక్ సీలింగ్ ఉపయోగించే ఎగుమతి వస్తువులకుఫ్యాక్టరీ ఆవరణ నుంచి నేరుగా ఓడ వరకు ఎటువంటి అడ్డంకులు లేని క్లియరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని బడ్జెట్ తెలిపిందిఎలాంటి సమ్మతి అవసరం లేని వస్తువుల దిగుమతి విషయంలో ఒక నమ్మకమైన దిగుమతిదారు ఎంట్రీ బిల్లును దాఖలు చేయడంవస్తువులు చేరుకున్న వెంటనే క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేయడానికి కస్టమ్స్ విభాగానికి స్వయంచాలకంగా సమాచారం అందుతుంది.

కస్టమ్స్ గిడ్డంగి వ్యవస్థను ఇకపై గిడ్డంగి ఆపరేటర్-కేంద్రీకృత వ్యవస్థగా మార్చనున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారుఈ కొత్త విధానం స్వీయ-ధ్రువీకరణఎలక్ట్రానిక్ ట్రాకింగ్రిస్క్-ఆధారిత ఆడిట్ పద్ధతులపై ఆధారపడి ఉంటుందిఈ సంస్కరణలు ప్రస్తుతం ఉన్న అధికారుల ఆమోదాలపై ఆధారపడే విధానాన్ని పక్కన పెట్టిలావాదేవీలలో జరిగే జాప్యాన్ని తగ్గించినిబంధనల పాటింపునకు అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చని ఆమె స్పష్టం చేశారు.

***


(रिलीज़ आईडी: 2221728) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam