ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటీ సంస్థలు సేఫ్ హార్బర్‌ను పొందేలా రూ.300 కోట్ల నుంచి రూ.2000 కోట్లకు పరిమితి పెంపు


ఆటోమేటెడ్ నియమ ఆధారిత ప్రక్రియ ద్వారా ఐటీ సేవల సేఫ్ హార్బర్‌ ధ్రువీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 12:57PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సేవలుఐటీ ఆధారిత సేవలునాలెడ్జి ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సేవలుకాంట్రాక్టు ఆర్ అండ్ డీ సేవల్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారుఈ వ్యాపార విభాగాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయిఈ సేవలన్నింటినీ ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్’ పేరుతో ఒకే విభాగం పరిధిలోకి తీసుకురావాలనివీటిన్నింటికీ ఒకే విధమైన సేఫ్ హార్బర్ మార్జిన్ను 15.5 శాతం వర్తింప చేయాలని ప్రతిపాదించారుఐటీ సేవల్లో సేఫ్ హార్బర్‌ను పొందడానికి పరిమితిని కేంద్ర బడ్జెట్ 2026-27లో రూ. 300 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచారు.

 

ఐటీ సేవల రంగంలో అందించే సేఫ్ హార్బర్ సేవలకు ఇకపై ఆటోమేటెడ్ నియమ ఆధారిత ప్రక్రియ ద్వారా ఆమోదం లభిస్తుందని ఆర్థికమంత్రి తెలియజేశారుదీని కోసం పన్ను అధికారి దరఖాస్తును పరిశీలించాల్సినఆమోదించాల్సిన అవసరం ఉండదన్నారుఐటీ సేవల సంస్థ ఒకసారి సేఫ్ హార్బర్‌కు దరఖాస్తు చేసుకుంటే.. తమ ఇష్టానుగుణంగా అయిదేళ్ల కాల వ్యవధి వరకు దానిని కొనసాగించవచ్చు.

 

అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (ఏపీఏ)ను పూర్తి చేయాలనుకొనే ఐటీ సంస్థల కోసం ఫాస్ట్ ట్రాక్ యూనిలేటరల్ ఏపీఏ ప్రక్రియలను ప్రకటించారుదీనిని రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారుపన్ను చెల్లింపుదారుల అభ్యర్థన మేరకు ఈ రెండేళ్ల సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగించుకోవచ్చుసవరించిన రిటర్నులు ఏపీఏలో నమోదయ్యే సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలకు కూడా వర్తిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2221638) సందర్శకుల సూచీ సంఖ్య : : 87