ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చరిత్రాత్మక భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగింపు.. ముఖ్య విషయాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JAN 2026 10:38AM by PIB Hyderabad

చరిత్రాత్మక భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముఖ్య విషయాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘చరిత్రాత్మక భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగింపునకు వచ్చిందని ప్రకటిస్తున్నందుకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంటు శ్రీ ఒంటోనియొ కొస్టాయూరోపియన్ కమిషన్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌‌లతో పాటు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘‘భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కిరావడం మన సంబంధాల్లో ఒక కీలక ప్రగతి ప్రస్థానంఈ ఒప్పందం కుదిరేటట్లు ఏళ్ల తరబడి తమ శ్రమని ధారబోసినిబద్ధతని కనబరిచిన ఐరోపా నేతలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను పెంపొందించిమన ప్రజలకు అవకాశాలను అందించడంతో పాటు సమృద్ధ భవిష్యత్తును నిర్మించే దిశగా భారత్-ఐరోపా భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ -
‘‘
యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంటు శ్రీ ఒంటోనియొ కొస్టాయూరోపియన్ కమిషన్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లెయెన్‌లతో కలిసి సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ
..’’
‘‘
ఈయూతో కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలను అందిస్తుంది.. ఈ ఒప్పందం భారత్ చరిత్రలో ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాల్లో అతి పెద్ద ఒప్పందంఇది :
మన రైతులకూచిన్న పరిశ్రమలకూ యూరోప్‌లోని మార్కెట్లకు చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
దీంతో తయారీకి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి.
మన సేవారంగాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుంది


(रिलीज़ आईडी: 2219586) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam