సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రిపబ్లిక్ డే పరేడ్‌లో భారతదేశ కథా వారసత్వాన్ని, వేవ్స్ దార్శనికతను చాటిచెప్పిన ఎంఐబీ శకటం
प्रविष्टि तिथि:
26 JAN 2026 4:04PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇవాళ కర్తవ్యపథ్‌లో ప్రదర్శించిన శకటం వివరాలు ఇలా ఉన్నాయి: "భారత్ గాథ: శృతి, కృతి, దృష్టి" పేరుతో రూపొందించిన శకటం, భారతదేశపు సుసంపన్న కథా వారసత్వాన్ని, ప్రాచీన మౌఖిక సంప్రదాయాల నుంచి నేటి ఆధునిక మీడియా, సినిమా వరకు సాగిన ప్రయాణాన్ని, దేశ సాంస్కృతిక వికాసాన్ని, కంటెంట్ క్రియేషన్ రంగంలో ప్రపంచ వేదికపై భారత్ శక్తిమంతమైన కేంద్రంగా ఎదిగిన తీరుని ఈ శకటం ప్రతిబింబించింది.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో ప్రదర్శించిన ఈ శకటం, వేవ్స్ వేదిక ప్రాముఖ్యతను చాటిచెప్పింది. భారత మీడియా, వినోద రంగ నాయకత్వం, ఆవిష్కరణలు, సాంస్కృతిక దౌత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే వేదికగా ఇది నిలిచింది. అంతేకాక, ప్రాచీన నాగరికత వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతో అనుసంధానిస్తూ సంప్రదాయాలను, భవిష్యత్ కథనాలను అద్భుతంగా ఆవిష్కరించింది.








/
*****
(रिलीज़ आईडी: 2218883)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam