గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత్ ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
కర్తవ్య పథ్‌లో జరిగిన అద్భుతమైన కవాతు.. భారత ప్రజాస్వామ్య శక్తిని, మన గొప్ప వారసత్వ సంపదను, దేశాన్ని ఏకం చేసే ఐక్యతను చాటిచెప్పిందని ఆయన తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కర్తవ్యపథ్‌లో దేశ గర్వానికి ప్రతీకగా నిలిచిన శక్తిమంతమైన ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి అన్నారు. వారి రాక భారత్-యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యానికి పెరుగుతున్న బలాన్ని, ఉమ్మడి విలువలపై దేశానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్-యూరప్ మధ్య వివిధ రంగాలలో లోతైన నిబద్ధత, సహకారానికి మరింత ఊపునిస్తుందని అన్నారు.
గణతంత్ర దినోత్సవ కవాతు భారతీయ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రదర్శించిందని, ఇది దేశ సన్నద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని, పౌరుల రక్షణ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
బలోపేతమవుతున్న దేశ భద్రతా దళాల సామర్థ్యాలను గణతంత్ర దినోత్సవ కవాతు కళ్లకు కట్టిందని శ్రీ మోదీ అన్నారు. మన భద్రతా దళాలు నిజంగా దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. కవాతు సమయంలో భద్రతా దళాల ఆకట్టుకునే ప్రదర్శనలకు సంబంధించిన దృశ్యాలను ఆయన పంచుకున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్తవ్య పథ్‌లో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం కనువిందు చేసిందని ఆయన అన్నారు. వైవిధ్యభరితమైన ప్రదర్శనలు, శకటాల ద్వారా ఈ కవాతు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పిందని అన్నారు. ఇది దేశం సుసంపన్నమైన, వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘గణతంత్ర దినోత్సవాన్ని భారత్ ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుంది.
వాటికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి..’’
‘‘నేడు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల జరిగిన కర్తవ్య పథ్ మార్గం.. జాతీయ గర్వానికి శక్తిమంతమైన ప్రదర్శనగా నిలిచింది.
మరికొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి’’
"మన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం దేశానికి దక్కిన గౌరవం.
వారి రాక భారత్-యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యానికి పెరుగుతున్న బలాన్ని, ఉమ్మడి విలువలపై మన నిబద్ధతను తెలుపుతుంది.
ఈ పర్యటన భారత్, యూరప్ మధ్య వివిధ రంగాల్లో లోతైన నిబద్ధత,సహకారానికి మరింత ఊపునిస్తుంది.
@antoniocostapm
@vonderleyen
@EUCouncil
@EU_Commission’’
‘‘నేడు గణతంత్ర దినోత్సవ కవాతు భారత దేశ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రదర్శించింది. ఇది దేశం సన్నద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని, పౌరుల రక్షణపై అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.’’
‘‘బలోపేతమవుతున్న దేశ భద్రతా దళాల సామర్థ్యాలను గణతంత్ర దినోత్సవ కవాతు కళ్లకు కట్టింది. మన దళాలు నిజంగా మన గర్వకారణం!
మరికొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి.’’
"నేడు కర్తవ్య పథ్‌లో దేశ సాంస్కృతిక వైవిధ్యం కనువిందు చేసింది. గణతంత్ర దినోత్సవ కవాతులోని ఉత్సాహభరితమైన ప్రదర్శనలు, శకటాల ద్వారా భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకలా జరుపుకుంది’’.