ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలను కలిసిన ప్రధాని
प्रविष्टि तिथि:
23 JAN 2026 4:02PM by PIB Hyderabad
వర్కాలలోని శివగిరి మఠంలో శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వామీజీలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.
సామాజిక సేవ, విద్య, ఆధ్యాత్మికత, సమాజ సంక్షేమంలో స్వామీజీల అంకితభావాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. దేశ సామాజిక నిర్మాణంలో వారి కృషి ఎన్నటికీ నిలిచి ఉంటుందన్నారు.
కలకాలం నిలిచే శ్రీ నారాయణ గురు ఆదర్శాలతో పుట్టిన ఈ ట్రస్టు.. తన కార్యకలాపాలతో సమాజంలో సమానత్వం, సామరస్యం, గౌరవాన్ని పెంపొందిస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“వర్కాలలోని శివగిరి మఠం శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు స్వాములను కలిశాను. సామాజిక సేవ, విద్య, ఆధ్యాత్మికత, సమాజ సంక్షేమం వంటి రంగాల్లో అంకితభావంతో కూడిన వారి కృషి మన సమాజ నిర్మాణానికి శాశ్వత తోడ్పాటును అందించింది.
కలకాలం నిలిచే శ్రీ నారాయణ గురు ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందిన వారు.. సమాజంలో సమానత్వం, సామరస్యం, గౌరవాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.”
(रिलीज़ आईडी: 2217919)
आगंतुक पटल : 3