ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

प्रविष्टि तिथि: 21 JAN 2026 9:24AM by PIB Hyderabad

ఈ రోజు మణిపూర్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాస్ట్ర సోదరీ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మణిపూర్ ప్రజలు తమ అంకితభావం, కఠోర శ్రమతో దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. క్రీడల పట్ల ఆ రాష్ట్రానికి ఉన్న మక్కువగొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రకృతితో గాఢమైన అనుబంధం నిజంగా ప్రశంసనీయమన్నారు.

మున్ముందు మణిపూర్ అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

మణిపూర్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర సోదరీ సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మణిపూర్ ప్రజలు దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నారు. క్రీడల పట్ల  ఆ రాష్ట్రానికి ఉన్న మక్కువ, అక్కడి సంస్కృతి, ప్రకృతితో అనుబంధం నిజంగా ప్రశంసనీయమైనవి. మున్ముందు అభివృద్ధి పథంలో మణిపూర్ స్థిరంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.” 

 

***


(रिलीज़ आईडी: 2216725) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam