ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధార్‌కు కొత్త ముఖచిత్రం: ఉదయ్ పేరుతో మస్కట్‌ను ఆవిష్కరించిన యూఐడీఏఐ


ఆధార్ సేవలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించే స్వేహపూర్వక సమాచార చిహ్నం మస్కట్

మైగవ్ వేదిక ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ఉదయ్ ఎంపిక.. 875 ప్రతిపాదనల నుంచి విజేతగా నిలిచిన కేరళకు చెందిన అరుణ్ గోకుల్

प्रविष्टि तिथि: 08 JAN 2026 3:06PM by PIB Hyderabad

ఉదయ్ పేరుతో ఆధార్ మస్కట్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐఇవాళ ప్రారంభించిందిఆధార్ సేవలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించే స్వేహపూర్వక సమాచార చిహ్నంగా మస్కట్‌ను రూపొందించారుఆధార్ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకుసులభంగా అర్థమయ్యేలా చేయటానికి ఈ ఉదయ్ మస్కట్ ఉపయోగపడుతుందిఇది ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తుందినవీకరణధ్రువీకరణఆఫ్ లైన్ వెరిఫికేషన్ప్రత్యేక సమాచార మార్పిడినూతన సాంకేతికతను అలవాటు చేసుకోవటంబాధ్యతయుతమైన వినియోగాన్ని మస్కట్ వివరిస్తుంది.

ఈ విజన్‌ను సాకారం చేసేందుకు అందరినీ భాగస్వాములను చేయాలని యూఐడీఏఐ బహిరంగ మార్గాన్ని ఎంచుకునిడిజైన్పేరును ఎంపిక చేసేందుకు మైగవ్ వేదిక ద్వారా జాతీయస్థాయి పోటీని నిర్వహించిందిదీనికి అనూహ్యమైన స్పందన లభించిందిదేశవ్యాప్తంగా విద్యార్థులునిపుణులుడిజైనర్ల నుంచి మొత్తం 875 ప్రతిపాదనలు వచ్చాయివాటిలో ప్రతీదీ ఆధార్‌ను వినూత్న రీతిలో వివరించిందిఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకతనుకచ్చితత్వాన్ని పాటించటానికి వివిధ స్థాయిల్లో మూల్యాంకనం జరిగిందిఈ ప్రక్రియ ద్వారా అద్భుతమైన సృష్టి ఆవిష్కృతమైందిప్రజల అంచనాలకు రూపమిస్తూసంస్థాగత ప్రాధాన్యతతో దీన్ని రూపుదిద్దారు.

మస్కట్ డిజైన్ పోటీలో కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన గోకుల్ మొదటి బహుమతిని గెలుచుకున్నారుమహారాష్ట్రలోని పూణెకు చెందిన ఇద్రిస్ దవైవాలాఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన కృష్ణ శర్మ వరుసగా రెండవమూడవ బహుమతులను గెలుచుకున్నారు.

మస్కట్ పేరు ఎంపిక పోటీలో భోపాల్‌కు చెందిన రియా జైన్ ప్రథమ బహుమతి గెలుచుకోగా.. పూణెకు చెందిన ఇద్రిస్ దవైవాలాహైదరాబాద్‌కు చెందిన మహరాజ్ శరణ్ చెల్లపిల్ల వరుసగా ద్వితీయతృతీయ స్థానాల్లో నిలిచారు.

తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో యూఐడీఏఐ ఛైర్మన్ నీల్‌కాంత్ మిశ్రా ఆధార్ మస్కట్‌ను ఆవిష్కరించివిజేతలను సత్కరించారుఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని వంద కోట్లకు పైగా ప్రజలకు ఆధార్ సమాచారాన్ని సరళంగాఅందరికీ అర్థమయ్యేలాస్వేహపూర్వకంగా చేరవేయటానికి యూఐడీఏఐ నిరంతరం చేస్తున్న కృషిలో భాగంగా మస్కట్ ఆవిష్కరణ కీలక ముందడుగని తెలిపారు.

బహిరంగ జాతీయ స్థాయి పోటీ ద్వారా మస్కట్ డిజైన్పేరు పెట్టాలని ప్రజలను ఆహ్వానించటం ద్వారా 'ఆధార్ ముఖ్య సూత్రంప్రజల భాగస్వామ్యంతో విశ్వాసంఆమోదం లభిస్తాయిఅని యూఐడీఏఐ మరోసారి స్పష్టం చేసిందనియూఐడీఏఐ సీఈఓ భువనేశ్ కుమార్ అన్నారుప్రజా ప్రయోజనకర వ్యవస్థగా ఆధార్ ను ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో ఈ పోటీకి లభించిన అనూహ్య స్పందన ద్వారా తెలుస్తుందని చెప్పారు.

ఈ మస్కట్ ఒక మిత్రుడిగావ్యాఖ్యాతగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోందనిఆధార్ సంబంధిత సమాచారాన్ని ప్రజలు సులభంగా అర్థం చేసుకోవటానికి ఇది దోహదపడుతుందని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వివేక్ సి వర్మ తెలిపారు.

 

***

 

(रिलीज़ आईडी: 2212553) आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam