హోం మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
శ్రీ కల్యాణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రముఖ జాతీయవాద నాయకుడికి నివాళులు
నేరాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విముక్తి కల్పించిన గొప్ప నేత కల్యాణ్ సింగ్.. దేశ వారసత్వం, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడటంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అధికారాన్ని త్యాగం చేయాల్సి వచ్చినా కూడా తన సిద్ధాంత విలువలకే కట్టుబడి ఉన్నారు.
ప్రజా సంక్షేమం, ప్రజల సేవ కోసం ఆయన చేసిన కృషి నేటికీ చిరస్మరణీయం
प्रविष्टि तिथि:
05 JAN 2026 1:14PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్యాణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఘన నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికపై చేసిన పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాద నాయకుడు, పూజనీయులు శ్రీ కల్యాణ్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు. ఉత్తరప్రదేశ్‌లో నేర రహిత పాలనకు ప్రతీకగా నిలిచిన కల్యాణ్ సింగ్.. దేశ వారసత్వాన్ని, సాంస్కృతిక గర్వాన్ని కాపాడటంలో ఎన్నడూ రాజీపడలేదు. తన సిద్ధాంత విలువలపై అంచలంచలమైన విశ్వాసంతో అవసరమైనప్పుడు అధికారాన్ని సైతం తృణప్రాయంగా వదులుకున్నారు. ప్రజా సంక్షేమం, సేవ కోసం ఆయన చేసిన కృషి నేటికీ చిరస్మరణీయంగా నిలిచింది.
***
(रिलीज़ आईडी: 2211540)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada