ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్‌వీ కౌండిన్య నావిక సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 DEC 2025 11:30PM by PIB Hyderabad
నౌకాయానం చేస్తున్న ఐఎన్ఎస్‌వీ కౌండిన్య జట్టు ఓ చిత్రాన్ని పంపించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది ఉత్సాహాన్ని ఆయన మెచ్చుకున్నారు. 2026వ సంవత్సరంలోకి దేశ ప్రజలు అడుగుపెడుతున్న సందర్భంలో... కౌండిన్య సిబ్బందికి ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఐఎన్ఎస్‌వీ కౌండిన్య జట్టు నుంచి ఈ చిత్రాన్ని అందుకుని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మనమంతా 2026లోకి అడుగు పెడుతున్న వేళ సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్‌వీ కౌండిన్య బృందానికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి యాత్ర సంతోషాలతో, సాఫల్యంతో పరిపూర్ణమవుగాక” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2210456)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam