ప్రధాన మంత్రి కార్యాలయం
రాబోయే రోజుల్లో ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరిచేందుకు సంస్కరణల పరంపరను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 10:45AM by PIB Hyderabad
రాబోయే రోజుల్లో ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరిచేందుకు సంస్కరణల పరంపరను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ థ్రెడ్ పోస్టును పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంపొందించటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా మేం చేసిన కృషికి సంబంధించిన ఉదాహరణలను ఈ కింది థ్రెడ్ లో చూడవచ్చు. రాబోయే రోజుల్లో మా సంస్కరణలు మరింత ఉత్సాహంగా, వేగంగా కొనసాగుతాయి"
***
(రిలీజ్ ఐడి: 2208842)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam