హోం మంత్రిత్వ శాఖ
స్వాతంత్ర్య సమరయోధుడు, అమరుడు ఉధమ్ సింగ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
· జలియన్‌వాలా బాగ్ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన దేశప్రజల తరఫున ప్రతీకారం తీర్చుకోవడంలో సాటిలేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన అమరవీరుడు ఉధమ్ సింగ్
· గదర్ ఉద్యమం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాట జ్వాలను విదేశాలకు వ్యాపింపజేయడంలో కీలక పాత్ర
· మాతృభూమి పట్ల ప్రగాఢ భక్తి భావాన్ని నింపే ఆయన వీరగాథ దేశ యువతకు తరగని స్ఫూర్తి
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 11:25AM by PIB Hyderabad
స్వాతంత్య్ర సమరయోధుడు, అమర వీరుడు ఉధమ్ సింగ్ జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళి అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్టులో.. జలియన్ వాలాబాగ్ ఊచకోతలో అమరులైన దేశ ప్రజల తరఫున ప్రతీకారం తీర్చుకోవడంలో అమరవీరుడు ఉధమ్ సింగ్ అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. గదర్ ఉద్యమం ద్వారా భారత స్వాతంత్య్ర పోరాట జ్వాలను విదేశాలకు వ్యాపింపజేయడంలోనూ ఉధమ్ సింగ్ కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన వీరగాథ దేశ యువతకు తరగని స్ఫూర్తి అని, మాతృభూమి పట్ల వారిలో భక్తిభావాన్ని నింపుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2208839)
సందర్శకుల సూచీ సంఖ్య : : 40
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam