ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 DEC 2025 5:37PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు నిర్వహిస్తున్న 'వీర్ బాల్ దివస్' జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.
వీర్ బాల్ దివస్‌ను పురస్కరించుకుని సాహిబ్‌జాదీల అసాధారణ ధైర్యం, అత్యున్నత త్యాగం గురించి పౌరులకు తెలియజేయడం, అవగాహన కల్పించడంతో పాటు దేశ చరిత్రలోని యువ వీరుల అజేయ ధైర్యం, త్యాగం, పరాక్రమాన్ని గౌరవించడం, స్మరించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీరుల గురించిన కథలు చెప్పడం, పారాయణాలు, పోస్టర్ రూపకల్పన, వ్యాస రచన పోటీలు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయి. వీటిని పాఠశాలలు, పిల్లల సంరక్షణ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర విద్యా వేదికలతో పాటు ఆన్‌లైన్‌లో మై గవ్, మైభారత్ పోర్టల్స్ వేదికగానూ ఈ కార్యకలాపాలను నిర్వహిస్తారు.
శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా డిసెంబర్ 26వ తేదీని 'వీర్ బాల్ దివస్'గా పాటించనున్నట్లు ప్రధానమంత్రి 2022 జనవరి 9న ప్రకటించారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన సాహిబ్‌జాదీలు బాబా జోరావర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అమరవీరుల అసమాన త్యాగాన్ని తరతరాలకు తెలియపరుస్తూ... అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (పీఎంఆర్బీపీ) పురస్కార గ్రహీతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
***
(रिलीज़ आईडी: 2208581)
आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam