ప్రధాన మంత్రి కార్యాలయం
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత కార్యక్రమంలో ఎఫ్‌టీఏల పాత్రను వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
23 DEC 2025 2:58PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. సుంకాలను తగ్గించడం మాత్రమే కాకుండా.. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా, మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచేలా భారత్ ఎఫ్‌టీయేలు పోషిస్తున్న పాత్రను ఈ కథనంలో శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. ‘‘భారత్‌లో మహిళా నేతృత్వంలో రూపొందించిన మొదటి ఎఫ్‌టీఏగా భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైనదని ఆయన వివరించారు. ఈ సంప్రదింపుల బృందంలో దాదాపుగా అందరూ మహిళలే ఉన్నారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..
‘‘ఇది ఆలోచనాత్మకమైన కథనం. ప్రస్తుతం భారత ఎఫ్‌టీఏలు సుంకాల తగ్గింపునకు మాత్రమే పరిమితం కాకుండా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే.. మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచే విస్తృత కార్యక్రమంలో భాగంగా మారుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ @PiyushGoyal వివరించారు.
మహిళా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మొదటి ఎఫ్‌టీఏగా భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మకమైనదిగా ఆయన వర్ణించారు. ఈ సంప్రదింపుల బృందంలో దాదాపు అందరూ మహిళలే ఉన్నారు.’’
(रिलीज़ आईडी: 2207943)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam