ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటులో భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
23 DEC 2025 6:19PM by PIB Hyderabad
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రసంగాల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం లభించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. చట్టసభ వేదికగా భారత సాంస్కృతిక-భాషా వైవిధ్యాన్ని చాటినందుకు స్పీకర్ శ్రీ ఓం బిర్లా సహా అన్ని పార్టీల ఎంపీలను ఆయన అభినందించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పార్లమెంటులో ఈ దృశ్యం నాకెంతో ఆనందం కలిగించిది. దేశ సాంస్కృతిక-భాషా వైవిధ్యం మనకెంతో గర్వకారణం. ఈ వైవిధ్యాన్ని పార్లమెంట్ వేదికగా చాటి చెప్పడంపై స్పీకర్ శ్రీ ఓం బిర్లా సహా అన్ని పార్టీల ఎంపీలకు హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2207933)
आगंतुक पटल : 3