హోం మంత్రిత్వ శాఖ
భారత్- న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి
మోదీ ప్రభుత్వ వాణిజ్య దౌత్యం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోందన్న హోం మంత్రి
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువస్తుందన్న హోం మంత్రి
భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, యువతకు ఈ ఎఫ్‌టీఏ లాభదాయకమైన అవకాశాలను కల్పించటంతో పాటు సంపదకు కొత్త ద్వారాలను తెరుస్తుందన్న శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనుసరిస్తోన్న పౌర కేంద్రీకృత విదేశాంగ విధానం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే తీరుకు గొప్ప ఉదాహరణ: శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
22 DEC 2025 7:58PM by PIB Hyderabad
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. వాణిజ్య దౌత్యం విషయంలో మోదీ ప్రభుత్వం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“మోదీ ప్రభుత్వ వాణిజ్య దౌత్యం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోంది.
సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చే భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ.. భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, యువతకు లాభదాయకమైన అవకాశాలను అందిస్తూ సంపదకు కొత్త ద్వారాలను తెరుస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పౌర కేంద్రీకృత విదేశాంగ విధానం ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే తీరుకు ఒక ‘మంచి ఉదాహరణ’ ”
(रिलीज़ आईडी: 2207568)
आगंतुक पटल : 5