సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డీసీఐడీ ద్వారా డిజిటల్, క్షేత్రస్థాయుల్లో సమాచార పరిధిని విస్తరిస్తున్న ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ కార్యక్రమాలపై జాతీయ స్థాయిలో అవగాహనను పెంచేందుకు డీసీఐడీ తోడ్పాటు
प्रविष्टि तिथि:
18 DEC 2025 12:44PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమే డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (డీసీఐడీ). ఇది ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, చొరవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు దోహదం చేస్తుంది.
మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, గిరిజన, మారుమూల, నగర ప్రాంతాల్లోని జనాభాకు సమాచారాన్ని చేరవేయడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.
ఈ పథకాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తన పరిధిలో ఉన్న మీడియా విభాగాలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), న్యూ మీడియా వింగ్ (ఎన్ఎండబ్ల్యూ) ద్వారా అమలు చేస్తుంది.
స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస యోజన – గ్రామీణ, పట్టణ, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదితర ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు బహిరంగ మల్టీమీడియా ప్రచారాలను సీబీసీ నిర్వహిస్తుంది.
డీసీఐడీ పథకం ద్వారా చేపడుతున్న కార్యకలాపాల వారీగా చేసిన వ్యయం వివరాలు సీబీసీ వెబ్‌సైట్ www.davp.nic.in లో అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవతసంరంలో డిజిటల్ విధానంలోనూ, క్షేత్రస్థాయిలోనూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ఆధునికమైన, బహుళ వేదికల్లో కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించి పథకం సామర్థ్యాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంపొందించింది.
డిజిటల్ మీడియా రంగంలో యువత, లక్షిత ప్రజలను చేరుకొనేందుకు వివిధ డిజిటల్ వేదికల్లో లక్ష్య ఆధారిత సమాచార ప్రచారాలు చేపడుతున్నారు. వీటిని భారత ప్రభుత్వ డిజిటల్ ప్రకటన విధానం- 2023 ప్రకారం నిర్వహిస్తారు.
జలగావ్‌లో లాంటి ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలతో సహా అన్ని మీడియా ప్రచారాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ (సీబీసీ) రూపొందిస్తుంది. వీటిని సంబంధిత మంత్రిత్వ శాఖల అవసరాలకు అనుగుణంగా, వివిధ కార్యక్రమాల పరిధిలోకి వచ్చే లబ్దిదారులకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది.
ఈ సమాచారాన్ని 17-12-2025న లోక్‌సభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అందించారు.
***
(रिलीज़ आईडी: 2206112)
आगंतुक पटल : 12