ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యమునా ఎక్స్‌ప్రెస్‌వే... మథుర వద్ద దుర్ఘటన..ప్రాణనష్టం… సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 DEC 2025 12:54PM by PIB Hyderabad

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మథుర వద్ద జరిగిన ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారుగాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారుదుర్ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 అందిస్తారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఉత్తరప్రదేశ్‌లోని మథుర వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం అత్యంత బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారుగాయపడ్డ వారికి రూ.50,000 అందిస్తారుప్రధానమంత్రి’’ అని పేర్కొంది.

 

***


(रिलीज़ आईडी: 2204567) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam