హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2001 పార్లమెంట్ దాడి సమయంలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నివాళులర్పించిన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా


నేడు ఉగ్రవాదంపై మన భద్రతా దళాల అజేయమైన ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకునే రోజు

2001లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన మన పార్లమెంట్ భవనంపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని దృఢ సంకల్పం, స్ఫూర్తితో తిప్పికొట్టిన మన భద్రతా దళాలు

ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను

వీర యోధుల త్యాగానికి, అమరత్వానికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది

प्रविष्टि तिथि: 13 DEC 2025 10:11AM by PIB Hyderabad

2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులకు దీటైన బదులిస్తూ వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేడు నివాళులర్పించారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఇలా అన్నారు. ‘‘2001లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన మన పార్లమెంట్ భవనంపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని మన భద్రతా దళాలు తమ స్ఫూర్తితో తిప్పికొట్టారు. ఉగ్రవాదంపై వారు ప్రదర్శించిన అజేయమైన ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకోవాల్సిన రోజు ఇది. ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొంటూ వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను. ఈ వీర యోధుల త్యాగంఅమరత్వానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’’.


(रिलीज़ आईडी: 2203627) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Marathi , Kannada , Malayalam , Bengali , Bengali-TR , Odia , English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati