సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఏఐ బ్యాండ్ ‘త్రిలోక్’తో ప్రసార భారతికి భాగస్వామ్యమమేమీ లేదు.. రాజ్యసభలో తెలిపిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
प्रविष्टि तिथि:
12 DEC 2025 2:53PM by PIB Hyderabad
ఏఐ ఆధారితమైన ‘‘త్రిలోక్’’ అనే మ్యూజిక్ బ్యాండ్‌తో ఆకాశవాణిలోనూ, దూరదర్శన్‌లోనూ, లేదా దాని ఓటీటీ వేదిక అయిన వేవ్స్ లోనూ కంటెంట్ ప్రసారానికి ప్రసార భారతి ఎలాంటి భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడమో, ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవడమో చేయలేదు.
ఈ సంవత్సరం దుర్గ నవరాత్రి ఉత్సవ కాలంలో, ఏఐ ఆధారిత భక్తి గీతాలు వేవ్స్ ఓటీటీ వేదిక సహా ప్రసార భారతి నెట్‌వర్క్‌లో ప్రసారం అయ్యాయి. ఎలాంటి ఆర్థిక వాగ్దానం లేదా పునరావృత్త వాగ్దానం చేయకుండానే ప్రయోగాత్మక పద్దతిలో ఈ పనిని చేశారు.
శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభలో ఈ రోజు ఇచ్చిన జవాబులో ఈ సమాచారాన్ని అందించారు.
(रिलीज़ आईडी: 2203062)
आगंतुक पटल : 3