సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార సేవలు (నియంత్రణ బిల్లు) 2023: ముగిసిన వాటాదారుల సంప్రదింపులు..
విస్తృత, సమగ్ర సంప్రదింపులపై ప్రభుత్వానికి నమ్మకం ఉంది:
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్
प्रविष्टि तिथि:
05 DEC 2025 1:47PM by PIB Hyderabad
ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు 2023 (బీఎస్ఆర్ బిల్లు) ముసాయిదాను 10.11.2023న ప్రజలకు అందుబాటులో ఉంచారు. సాధారణ ప్రజలు, భాగస్వాముల నుంచి 09.12.2023 వరకు అభిప్రాయాలు, స్పందనలు, సూచనలను కోరారు. తదనంతరం ఈ తేదీని15.01.2024 వరకు పొడిగించారు.
మీడియా, వినోద పరిశ్రమ సంఘాలతో సహా వాటాదారుల నుంచి అందిన సూచనల ఆధారంగా అభిప్రాయాలను తెలియజేసేందుకు గడువును 15.10.2024 వరకు ప్రభుత్వం పొడిగించింది.
వాటాదారులందరి నుంచి వచ్చిన సూచనలను పరిశీలించారు. విస్తృతమైన, సమగ్రమైన సంప్రదింపులను ప్రభుత్వం విశ్వసిస్తోందని మంత్రి తెలిపారు.
శ్రీ సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభలో అందించారు.
***
(रिलीज़ आईडी: 2199677)
आगंतुक पटल : 8