ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో వాయు కాలుష్యంపై జరిగిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ. కే. మిశ్రా
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించటం, నివారించేందుకు చేపడుతున్న వివిధ చర్యలను సమీక్షించిన డాక్ట్ పీ.కే. మిశ్రా
స్వచ్ఛ ఇంధనాలు, ఈ-వాహనాలకు మారాల్సిన అవసరం ఉంది: డాక్టర్ పీ.కే.మిశ్రా
ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి: డాక్టర్ పీ.కే.మిశ్రా
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌లో పేర్కొన్న వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి: డాక్టర్ పీ.కే. మిశ్రా
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అంతటా వరి పంట వ్యర్థాలను కాల్చటాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి
గాలి నాణ్యత పడిపోయే సమస్యను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేలా మెరుగుపరచాల్సిన చర్యలపై నిర్ణయాలు
प्रविष्टि तिथि:
13 OCT 2023 6:58PM by PIB Hyderabad
ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై జరిగిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశానికి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీ. కె. మిశ్రా అధ్యక్షత వహించారు. శీతాకాలం సమీపిస్తున్నందున ఢిల్లీ-ఎన్‌సీఈఆర్‌లో వాయు నాణ్యత పడిపోయే సమస్యను ఎదుర్కొనే విషయంలో వివిధ భాగస్వాముల సంసిద్ధతను సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు.
పారిశ్రామిక, వాహన, నిర్మాణం- కూల్చివేత కార్యకలాపాల నుంచి వచ్చే దుమ్ము, రోడ్లు- ఆర్‌ఓడబ్ల్యూ నుంచి ధూళి, మున్సిపల్ ఘన వ్యర్థాలు- జీవ పదార్థాలు- ఇతర వ్యర్థాలను కాల్చటం, వ్యవసాయ- వరి పంట వ్యర్థాలు కాల్చటం, విక్షేపిత మూలాలతో సహా వాయు కాలుష్య కారకాలను తగ్గించేందుకు చేపడుతోన్న వివిధ చర్యల గురించి వివరంగా చర్చించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పచ్చదనం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టటం గురించి కూడా సమావేశంలో ప్రస్తావించారు.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) అమలు, పర్యవేక్షణ, క్షేత్ర స్థాయిలో అమలును మెరుగుపరిచే చర్యల గురించి కూడా ముఖ్య కార్యదర్శి చర్చించారు. వాయు నాణ్యత క్షీణించకుండా నిరోధించేందుకు సంబంధిత అధికారులంతా గ్రాప్‌లో పేర్కొన్న చర్యలను ఖచ్చితంగా అమలు చేయడం చాలా కీలకమని ఆయన అన్నారు.
ఎన్‌సీఆర్‌లోని పరిశ్రమలు స్వచ్ఛమైన ఇంధనాలకు మారుతున్నాయని సీఏక్యూఎం (వాయు నాణ్యత నిర్వహణ కమిషన్) చైర్మన్ డాక్టర్ ఎం. ఎం. కుట్టి తెలిపారు. 240 పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే 211 ప్రాంతాలకు సీఎన్‌జీ కనెక్షన్లు అందాయన్న ఆయన.. 7759 ఇంధన ఆధారిత పరిశ్రమలలో 7449 పరిశ్రమలు పీఎన్‌జీ లేదా ఇతర ఆమోదిత ఇంధనాలకు మారాయని అన్నారు.
ఎన్‌సీఆర్‌లో ఈవీల సంఖ్య పెరిగినట్లు తెలిపిన సీఏక్యూఎం ఛైర్మన్.. ప్రస్తుతం ఎన్‌సీఆర్‌లో 4,12,393 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ-బస్సులు, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరిగిందని, ఇప్పుడు ఢిల్లీలో 4,793 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
సీఏక్యూఎం ఛైర్మన్ వివరాల ప్రకారం ఢిల్లీలో 5150 టీపీడీ (రోజుకు టన్నులు) గల 5 నిర్మాణం- కూల్చివేతల (సీఅండ్‌డీ) సంబంధిత వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.. 1000 టీపీడీ సామర్థ్యం గల మరో కేంద్రం నిర్మాణంలో ఉంది. హర్యానాలో 600 టీపీడీ సామర్థ్యం సీఅండ్‌డీ కేంద్రం పనిచేస్తోంది. ఇక్కడ 700 టీపీడీ సామర్థ్యం గల కేంద్రం నిర్మాణంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 1300 టీపీడీ సామర్థ్యం గల కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడ 2 కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలను సీఅండ్‌డీ వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచాలని ఆయన కోరారు.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వరి పంట వ్యర్థాలను కాల్చటాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ సమస్యను నిశితంగా పర్యవేక్షించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులను ప్రధానమంత్రి ముఖ్య కార్శదర్శి ఆదేశించారు. పంట వ్యర్థాల నిర్వహణ (సీఆర్ఎం- క్రాప్ రెసిడ్యూ మేనేజ్‌మెంట్) యంత్రాలను ఉపయోగించి వరి పంట వ్యర్థాలను నిర్వహించటం, బయో-డీకంపోజర్లను ఉపయోగించటం లాంటి ఇన్-సిటు పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. ఈ సాంకేతికతను మెరుగుపరచాలని భారత వ్యవసాయ పరిశోధన మండలిని (ఐకార్) ఆయన కోరారు. ఎక్స్-సిటు నిర్వహణ గురించి మాట్లాడిన ఆయన.. వరి గడ్డిని ఆర్థికపరమైన వనరుగా మార్చే విషయంపై దృష్టి సారించాలని సలహా ఇచ్చారు. వరి గడ్డిని సమర్థవంతంగా ఎక్స్-సిటు పద్ధతిలో వినియోగించేందుకు బేలింగ్, బ్రిక్వెటింగ్, పెల్లెటింగ్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు బేల్స్‌ను నిల్వ చేసేందుకు తగిన నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బయోమాస్‌ను ముఖ్యంగా వరి గడ్డిని కో-ఫైరింగ్ చేసేందుకు నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
బయోమాస్ పెల్లెట్‌ల సేకరణ, విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బెంచ్‌మార్క్ ధరను అవలంబించడం, మార్చి 2024 నాటికి మొత్తం ఎన్‌సీఆర్ ప్రాంతం మొత్తానికి గ్యాస్ మౌలిక సదుపాయాలు- సరఫరాను విస్తరించడం, డిమాండ్‌కు అనుగుణంగా ఖచ్చితంగా తక్షణమే బయోమాస్‌ను సరఫరా చేయడం తదితర చర్యలతో కూడిన బహుముఖ విధానాన్ని అవలంబించాలని ముఖ్య కార్యదర్శి ప్రధానంగా చెప్పారు. కాలం చెల్లిన వాహనాలను, అధిక లోడింగ్ వంటి ఇతర కారణాల వల్ల కాలుష్యం కలిగిస్తున్నట్లు స్పష్టంగా కనిపించే వాహనాల స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చేందుకు ముమ్మర డ్రైవ్‌లను నిర్వహించాలన్న ఆయన.. ‘గ్రాప్’లో (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) పేర్కొన్న చర్యలను సంబంధిత అధికార యంత్రాంగమంతా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పర్యావరణం, వ్యవసాయం, విద్యుత్, పెట్రోలియం, రోడ్డు రవాణా - రహదారులు, గృహనిర్మాణం - పట్టణ వ్యవహారాలు, పశుసంవర్ధక - పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు.. ఎన్‌సీఆర్ - పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాయు నాణ్యత నిర్వహణ కమిషన్.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల ప్రధాన కార్యదర్శులు.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు, డీపీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2197936)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam