ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీలంక అధ్యక్షుడితో టెలిఫోన్‌లో సంభాషించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో జరిగిన ప్రాణనష్టం, విధ్వంసంపై భారత ప్రధాని సంతాపం
సకాలంలో, ప్రభావవంతమైన సాయాన్ని అందించిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే
‘మహాసాగర్’ దార్శనికతకు అనుగుణంగా, ఆపదవేళ ‘తొలి సహాయకారి’గా.. ఆపరేషన్ సాగర బంధు కింద భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని హామీ
प्रविष्टि तिथि:
01 DEC 2025 8:50PM by PIB Hyderabad
గౌరవ శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయకేతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు.
దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో జరిగిన ప్రాణనష్టం, భారీ విధ్వంసంపై భారత ప్రధానమంత్రి హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేశారు. ఈ అత్యవసర సమయంలో శ్రీలంక ప్రజలకు భారతీయులు బలమైన సంఘీభావాన్ని, మద్దతును అందిస్తున్నారని ఆయన చెప్పారు.
విపత్తు నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ బృందాలను మోహరించి, సహాయక సామగ్రిని వేగంగా అందించడం ప్రశంసనీయమన్నారు. సకాలంలో, ప్రభావవంతంగా స్పందించిన భారత్‌కు శ్రీలంక ప్రజల తరఫున కూడా అభినందనలు తెలియజేశారు.
ఆపరేషన్ సాగర బంధు కింద శ్రీలంకకు భారత్ ఎల్లవేళలా మద్దతునిస్తుందనీ.. బాధితులకు రక్షణ, ఉపశమనం కల్పిస్తుందని శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకేకు భారత ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ‘మహాసాగర్’ దార్శనికతకు అనుగుణంగా, విపత్తు వేళ ‘తొలి సహాయకారి’గా.. భవిష్యత్తులో అత్యవసర సాయాన్ని భారత్ కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. పునరావాస చర్యలు, ప్రజా సేవల పునరుద్ధరణ, ప్రభావిత ప్రాంతాల్లో జీవనోపాధి పునరుద్ధరణ చర్యల్లో శ్రీలంకకు భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు నాయకులు అంగీకారానికి వచ్చారు.
***
(रिलीज़ आईडी: 2197365)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada