ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 DEC 2025 3:24PM by PIB Hyderabad

బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారుభారతదేశపు చెక్కుచెదరని సంకల్పాన్నీఅత్యున్నత వృత్తి నైపుణ్యాన్నీ బీఎస్ఎఫ్ సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సేవలందిస్తారువారి శౌర్యంతోపాటు మానవతా స్ఫూర్తి కూడా అసాధారణమైనదిఅని మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి నా శుభాకాంక్షలుదృఢ సంకల్పానికి అత్యున్నత వృత్తి నైపుణ్యానికి భారత బీఎస్ఎఫ్ ప్రతీకవారి కర్తవ్యం ఆదర్శనీయంఎన్నో సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో సేవలందిస్తారువారి ధైర్యంతో పాటు మానవతా స్ఫూర్తి అసాధారణమైనదిమన దేశానికి సేవలందిస్తూరక్షిస్తున్న బీఎస్ఎఫ్ దళానికి నా శుభాకాంక్షలు.”


(रिलीज़ आईडी: 2196962) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati