ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అత్యున్నత చట్ట రూపకర్తలకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 NOV 2025 10:01AM by PIB Hyderabad

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వికసిత్ భారత్ నిర్మాణం దిశగా దేశం చేస్తోన్న సామూహిక కృషికి వారి దార్శనికత, దృష్టి కోణాలు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని అన్నారు. 

భారత రాజ్యాంగం ప్రజల గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు.   పౌరులకు హక్కులను ఇచ్చిన రాజ్యాంగమే విధులను కూడా గుర్తుచేస్తోందన్నారు. వీటిని నిజాయితీ, నిబద్ధతతో నెరవేర్చాలని కోరారు. ఈ విధులు ఒక బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఆయన స్పష్టం చేశారు. 

దేశానికి ఉన్న సంకల్పం గురించి పేర్కొన్న ప్రధాని.. చేసే పనుల ద్వారా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలని, తద్వారా దేశ పురోగతి - ఐక్యతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

“రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పిస్తున్నాం. వికసిత్ భారత్‌ను నిర్మించే మన అన్వేషణలో వారి దార్శనికత, దృక్కోణం మనల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. 

ప్రజల గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు మన రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇది మనకు హక్కులను ఇస్తున్నప్పటికీ మనం ఎల్లప్పుడూ నెరవేర్చేందుకు ప్రయత్నించాల్సిన పౌర విధులను కూడా గుర్తు చేస్తోంది. ఈ విధులు ఒక బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. 

మన పనుల ద్వారా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం.”

 

***


(रिलीज़ आईडी: 2194561) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam