ప్రధాన మంత్రి కార్యాలయం
జోహాన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
प्रविष्टि तिथि:
23 NOV 2025 9:41PM by PIB Hyderabad
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా కెనడా ప్రధానమంత్రి గౌరవనీయ శ్రీ మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఇద్దరూ భారత్, కెనడా భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.
నేతలిద్దరూ ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌ల మధ్య నెలకొన్న సాంకేతికత, నవకల్పన (ఏసీఐటీఐ) ప్రధాన భాగస్వామ్యాన్ని స్వాగతించారు. ఈ భాగస్వామ్యంతో కీలక సాంకేతికతలు, పరమాణు ఇంధనం, సరఫరా వ్యవస్థల వివిధీకరణలతో పాటు కృత్రిమ మేధ రంగాల్లో మూడు దేశాల సహకారం బలోపేతం కానుంది. గత జూన్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని కనానాస్కిస్‌లో నిర్వహించిన సందర్భంగా తాము సమావేశమైనప్పటి నుంచీ, అలాగే కిందటి నెలలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల చర్చలకు నాంది పలికినప్పటి నుంచీ సంబంధాలు వేగం పుంజుకోవడాన్ని నేతలు ప్రశంసించారు. ప్రధాన మంత్రులిద్దరూ వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, విద్య, అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ, ఇంధన రంగాల్లో కొనసాగుతున్న సహకారంపై చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న కృత్రిమ మేధ సంబంధిత శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ కార్నీ మద్దతు తెలిపారు.
ఒక పెద్ద లక్ష్యంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ) కుదుర్చుకొనే దిశగా సంప్రతింపులను మొదలుపెట్టడానికి నేతలు అంగీకరించారు. ఇరు దేశాల వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేస్తూ, 5,000 కోట్ల అమెరికా డాలర్ల స్థాయికి చేర్చడం సీఈపీఏ లక్ష్యం. ఇరు పక్షాలూ దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న పౌర ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పరమాణు రంగ సహకారాన్ని ఈ సమావేశం సందర్భంగా పునరుద్ఘాటించారు.
యురేనియాన్ని దీర్ఘకాలం పాటు సరఫరా చేసుకోవడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని, సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా సంభాషణలు జరుగుతున్న అంశం కూడా నేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది.
ఉన్నత స్థాయిలో చర్చలను కొనసాగించడానికి గల ప్రాధాన్యాన్ని నేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ కార్నీని భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
***
(रिलीज़ आईडी: 2193882)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam