ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిర్మాణంలో ఉన్న... సూరత్ బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని సమీక్షించిన ప్రధాని

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ప్రధాని

బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణంలో పొందిన అనుభవాలను పదిలపరచాలన్న ప్రధాని

‘దేశం కోసం పనిచేస్తున్నాం.. కొత్తదాన్ని సృష్టిస్తున్నాం’ అనే భావన కలిగినప్పుడు..

అది అపారమైన ప్రేరణకు మూలంగా ఉంటుందన్న ప్రధాని

Posted On: 16 NOV 2025 3:47PM by PIB Hyderabad

గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సందర్శించారుముంబయి–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ పురోగతిని ఆయన సమీక్షించారుభారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ బృందంతో మాట్లాడిన ఆయన… నిర్మాణ వేగంనిర్దేశిత లక్ష్యాలను చేరుకునే విషయంలో పురోగతితో పాటు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారుఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్ట్ సజావుగా ముందుకు సాగుతోందని ప్రాజెక్ట్ ‌నిర్మాణ సిబ్బంది ఆయనకు తెలిపారు

గుజరాత్‌లోని నవ్‌సారిలో ఉన్న నాయిస్ బారియర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక మహిళా ఇంజనీర్ స్వీయ అనుభవాన్ని పంచుకున్నారుఈ ఫ్యాక్టరీలో రీబార్ కేజ్‌ల వెల్డింగ్ కోసం రోబోటిక్ యూనిట్లను ఉపయోగిస్తున్నారుభారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలును తయారు చేసే విషయంలో వ్యక్తిగత అనుభవం గురించి ప్రధాని ఆమెను అడిగారుఈ చరిత్రాత్మక పని పట్ల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలనుకుంటున్నట్లు అడిగారుదేశంలోని మొట్టమెదటి బుల్లెట్ రైలులో పాలుపంచుకుంటున్నందుకు గర్విస్తున్నట్లు ఆమె చెప్పారుదీనిని కలల ప్రాజెక్టుగా వర్ణించిన ఆమె.. తన కుటుంబానికి ఇది గర్వకారణమని తెలిపారు

జాతీయ సేవాస్ఫూర్తికి ఉన్న గొప్పతనం గురించి ప్రధాని మాట్లాడారు. "దేశం కోసం కష్టపడుతున్నాం… కొత్తదాన్ని సృష్టిస్తున్నాంఅనే భావన కలిగినప్పుడు.. అది అపారమైన శక్తిప్రేరణకు మూలంగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారుభారతదేశ అంతరిక్ష యాత్రను ఉదాహరణగా ఆయన చెప్పారుదేశపు తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన శాస్త్రవేత్తలకు ఉండే గొప్ప గౌరవాన్ని ఆయన గుర్తు చేశారుఆ ప్రారంభమే నేడు వందలాది ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే స్థాయికి చేరిందని ఆయన వివరించారు.

ఈ ప్రాజెక్ట్‌లో అనుసరిస్తున్న కఠినమైన డిజైన్ఇంజినీరింగ్ నియంత్రణ ప్రక్రియలను లీడ్ ఇంజినీరింగ్ సంస్థ మేనేజర్‌‌ గా పనిచేస్తున్న బెంగళూరు నివాసి శృతి వివరించారుప్రాజెక్ట‌ును చేపట్టే ప్రతి దశలోనూ తమ బృందం అనుకూలతలుప్రతికూలతలను అంచనా వేస్తూ సమస్యలకు పరిష్కారాలను గుర్తిస్తోందని.. లోపరహిత ప్రాజెక్టు కోసం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోందని తెలిపారు

ఈ నిర్మాణంలో పొందిన అనుభవాలను ఒక 'బ్లూ బుక్మాదిరిగా పొందుపరిస్తే.. భారతదేశం బుల్లెట్ రైళ్ల నిర్మాణం దేశంలో పెద్ద ఎత్తున చేపట్టే దిశగా నిర్ణయాత్మకంగా ముందుకు సాగగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారుపునరావృత ప్రయోగాలను భారత్ నివారించాలన్న ఆయన.. వీటికి బదులుగా ఇప్పటికే ఉన్న నమూనాల నుంచి నేర్చుకున్న విషయాలను అనుకరించాలన్నారుఒక పని ఎందుకు చేశామన్న అంశంపై స్పష్టత ఉంటేనే మళ్లీ ఆ పని సమర్థవంతంగా జరుగుతుందనీలేదంటే ఒక లక్ష్యందిశా లేకుండా పనులు సాగుతాయని హితవు పలికారుబ్లూ బుక్ వంటి రికార్డులను నిర్వహించడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందనిదేశ నిర్మాణానికి ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. "మనం ఇక్కడ మన జీవితాలను అంకితం చేసి దేశం కోసం విలువను అందిస్తున్నాంఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు

ఒక ఉద్యోగి తన అనుభవాన్ని ఒక హృదయపూర్వక పదజాలంతో కూడిన కవిత రూపంలో చెప్పారుఆయన నిబద్ధతను మెచ్చుకున్న ప్రధాని..ఆయన్ను ప్రశంసించారు

ప్రధానమంత్రి పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కూడా పాలుపంచుకున్నారు

నేపథ్యం:

దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే ముంబయిఅహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ (ఎంఏహెచ్ఎస్ఆర్)..  హై-స్పీడ్ అనుసంధానత యుగంలోకి భారత్‌ను తీసుకెళ్లనుందిఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు.

సుమారు 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో 352 కి.మీ గుజరాత్దాద్రా నగర్ హవేలీలో ఉండగా.. 156 కి.మీ మహారాష్ట్రలో ఉన్నాయిఈ కారిడార్ సబర్మతిఅహ్మదాబాద్ఆనంద్వడోదరభరూచ్సూరత్బిలిమోరావాపిబోయిసర్విరార్థానేముంబయి వంటి ప్రధాన నగరాలను కలుపుతుందిదేశంలోని రవాణా మౌలిక సదుపాయాల విషయంలో ఈ ప్రాజెక్టు భారీ మార్పులు తీసుకొస్తుంది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందిఈ ప్రాజెక్టులో 465 కి.మీ.లు.. అంటే సుమారు 85 శాతం వయాడక్ట్‌లు ఉంటాయిఇది భద్రతను మెరుగుపరచటంతో పాటు భూ వినియోగాన్ని తగ్గిస్తుందిఇప్పటివరకు 326 కి.మీ.ల వయాడక్ట్ పని పూర్తైందినదుల మీద ఉన్న మొత్తం 25 వంతెనల్లో 17 నిర్మాణం ఇప్పటికే పూర్తైంది

ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే బుల్లెట్ రైలు ముంబయిఅహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటలకు తగ్గిస్తుందిఇది ఈ నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతంసులభతరంమరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా భారీ మార్పు తీసుకురానుందిఈ బుల్లెట్ రైలు నడుస్తున్న ప్రాంతాల్లో వ్యాపారంపర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుందితద్వారా ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతమౌతుందని భావిస్తున్నారు

సుమారు 47 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సూరత్బిలిమోరా విభాగం దాదాపు పూర్తి అయిందిఈ విభాగంలో సివిల్ట్రాక్-బెడ్ వేసే పనులు 100 శాతం పూర్తయ్యాయివజ్రాల పరిశ్రమ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సూరత్‌కు ఉన్న గుర్తింపు ఆధారంగా ఆ నగరంలో బుల్లెట్ రైలు స్టేషన్‌ డిజైన్ ఉందిఇది సొగసుకార్యకలాపాలు.. రెండింటికి సమతూకంగా ఉందిప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్‌ను రూపొందించారుఇందులో విశాలమైన వెయిటింగ్ లాంజ్‌లువిశ్రాంతి గదులురిటైల్ దుకాణాలు ఉన్నాయిఇది సూరత్ మెట్రోసిటీ బస్సులుభారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో సహా ఆటంకం లేని బహుళ నమూనా అనుసంధానతను కూడా అందిస్తుంది.

 

***


(Release ID: 2190624) Visitor Counter : 7