ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ ఘటనపై భూటాన్ సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని

Posted On: 11 NOV 2025 3:01PM by PIB Hyderabad

గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలో భారత్‌కు సంఘీభావం తెలిపిన ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో.. బాధితులువారి కుటుంబాల కోసం భూటాన్ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ఈ సానుభూతిని నేనెన్నటికీ మరచిపోలేను’’ అంటూ.. కరుణను, ఐక్యతను చాటిన ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో భూటాన్ ప్రజలు ఓ ప్రత్యేక ప్రార్థన ద్వారా భారత ప్రజలకు సంఘీభావం తెలిపారు. గౌరవ నాలుగో రాజు 70వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు సంఘీభావాన్ని ప్రకటించారు. దీన్ని నేనెన్నటికీ మరచిపోలేను.’’

 

***


(Release ID: 2188816) Visitor Counter : 10