ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ - 2025ను గెలుచుకున్న భారతీయ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
03 NOV 2025 6:14AM by PIB Hyderabad
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ - 2025 చివరి పోటీలో భారతీయ జట్టు అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ - 2025 చివరి పోటీలో భారతీయ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఫైనల్లో వారు గొప్ప నైపుణ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కనబరిచారు. ఈ క్రీడా పోటీలో మొదటి నుంచీ కూడా జట్టు అసాధారణ స్ఫూర్తినీ, గట్టి పట్టుదలనూ చూపింది. మన క్రీడాకారిణులకు అభినందనలు. ఈ చరిత్రాత్మక గెలుపు భావి క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుంది.
***
MJPS/ST
(Release ID: 2185799)
Visitor Counter : 9
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada