ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ఉపగ్రహాల్లో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎమ్ఎస్-03ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
02 NOV 2025 7:24PM by PIB Hyderabad
భారత ఉపగ్రహాల్లో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం అయిన సీఎమ్ఎస్-03ని విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉంది!
భారత ఉపగ్రహాల్లో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహమైన సీఎమ్ఎస్-03ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు అభినందనలు.
మన అంతరిక్ష శాస్త్రవేత్తల కృషితో మన అంతరిక్ష రంగం శ్రేష్ఠత, ఆవిష్కరణలకు పర్యాయపదంగా మారిన తీరు ప్రశంసనీయం. వారి విజయాలు జాతీయ పురోగతిని వేగవంతం చేశాయి... లెక్కలేనన్ని జీవితాలకు సాధికారత కల్పించాయి.
@isro”
***
MJPS/ST
(Release ID: 2185645)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam