భారత ఎన్నికల సంఘం
                
                
                
                
                
                    
                    
                        ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, సమస్యల పరిష్కారానికి ఓటర్ హెల్ప్  లైన్ 1950, ‘బుక్ -ఎ-కాల్ విత్ బీఎల్‌వో’ సేవలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                29 OCT 2025 4:58PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                1. ఎన్నికలకు సంబంధించిన ఏవైనా సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రజల జాతీయ ఓటరు హెల్ప్‌లైన్, అలాగే 36 రాష్ట్ర, జిల్లా స్థాయి హెల్ప్‌లైన్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.
2. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ సంప్రదింపు కేంద్రం(ఎన్సీసీ) కేంద్ర హెల్ప్‌లైన్‌గా పనిచేస్తుంది. ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 8:00 గంటల వరకు టోల్-ఫ్రీ నంబర్ 1800-11-1950 ద్వారా అందుబాటులో ఉంటుంది. శిక్షణ పొందిన నిర్వాహకులు ప్రజలకు, ఇతర భాగస్వాములకు ఎన్నికల సేవలు, సందేహాలపై సమాచారం అందిస్తారు.
3. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లాలకు తమ సొంత సంప్రదింపు కేంద్రాలను (ఎస్‌సీసీ), జిల్లా సంప్రదింపు కేంద్రాలను (డీసీసీ)ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇవి సంవత్సరం పొడవునా ప్రతి రోజూ కార్యాలయ సమయాల్లో పనిచేస్తాయి. ఆయా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలకు స్థానిక భాషల్లో సహాయం అందిస్తాయి.
4. అన్ని ఫిర్యాదులు, ప్రశ్నలను జాతీయ ఫిర్యాదు సేవా వేదిక (ఎన్‌జీఎస్‌పీ 2.0) ద్వారా నమోదు చేసి, ట్రాక్ చేస్తారు.
5. ఎన్నికల సంఘం ‘బుక్-ఏ-కాల్ విత్ బీఎల్‌ఓ’ సౌకర్యాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసీఐఎన్‌ఈటీ యాప్‌లో అందుబాటులో ఉంటే ఈ ఫీచర్ ద్వారా పౌరులు తమ బూత్ స్థాయి అధికారిని (బీఎల్‌ఓ) నేరుగా సంప్రదించవచ్చు.
6. పౌరులు ఈసీఐఎన్‌ఈటీ యాప్ ద్వారా కూడా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చు. ప్రజల అభ్యర్థనలను ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు 48 గంటల్లోగా పరిష్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
7. ఈ సదుపాయాలు ఇప్పటికే ఉన్న ఎన్నికల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలకు అదనంగా అందుబాటులో ఉన్నాయి. పౌరులు తమ ఫిర్యాదులను complaints@eci.gov.in ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు.
8. ఓటర్లు ‘‘బుక్-ఏ-కాల్ విత్ బీఎల్‌ఓ’’ 1950 ఓటర్ హెల్ప్‌లైన్ సౌకర్యాలను వినియోగించి.. ఎన్నికల సమాచారం, అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించుకోవాలని ఈసీఐ సూచించింది.
 
***
                
                
                
                
                
                (Release ID: 2183978)
                Visitor Counter : 13