ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదాతి దళ దినోత్సవ సందర్భంగా సైనికుల ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2025 8:39PM by PIB Hyderabad

పదాతి దళ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పదాతి దళంలోని సైనికుల ధైర్య, సాహసాలను ప్రశంసించారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"పదాతి దళ దినోత్సవం రోజున మనమంతా సైనికుల అచంచల ధైర్యసాహసాలు, అంకితభావాన్ని గౌరవించుకుందాం. మన దేశ రక్షణ పట్ల వారి నిబద్ధత... బలం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి సైనికుడు శౌర్యం, దేశ సేవ వంటి అత్యున్నత ఆదర్శాలను ప్రతిబింబిస్తూ ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తారు.

@adgpi”


(రిలీజ్ ఐడి: 2183456) సందర్శకుల సూచీ సంఖ్య : : 57