ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సర్దార్ పటేల్‌ను గౌరవించుకోవడానికి అక్టోబరు 31న ఏకతా పరుగులో భాగం పంచుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి

Posted On: 27 OCT 2025 9:15AM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ  నెల 31న నిర్వహిస్తున్న ‘ఏకతా పరుగు’ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ ఏకతా దినోత్సవ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశ ప్రజలు ఏకతాటి మీద నిలిచి, ఎప్పటికీ కలసిమెలసి ఉండాలని సర్దార్ పటేల్ కన్న కలను పండుగలా నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భారత ఏకతా దినోత్సవానికి సంబంధించి ‘ఎక్స్’లో నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా రాశారు:
‘‘అక్టోబరు 31న ఏకతా పరుగులో అంతా పాలుపంచుకోండి.. ఐకమత్య భావనను వేడుకలా నిర్వహించుకొందాం. రండి, సర్దార్ పటేల్ కన్న అఖండ భారత్ కలను మనమందరం గౌరవించుకొందాం.’’

 

 

***

MJPS/SR
 


(Release ID: 2183094) Visitor Counter : 5