హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో 21 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా లొంగుబాటు.. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హర్షం


లొంగిపోయిన 21 మంది నక్సల్స్‌లో 13 మంది సీనియర్లు

మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని హింసామార్గాన్ని విడిచిపెట్టి,
ప్రధాన స్రవంతిలో చేరినందుకు వారికి నా ప్రశంసలు

తుపాకులు పట్టుకు తిరుగుతున్న మిగతా వారు కూడా సాధ్యమైనంత త్వరగా లొంగిపోవాలన్నదే నా విజ్ఞప్తి

నక్సలిజాన్ని 2026 మార్చి 31కల్లా నిర్మూలించాలని మేం సంకల్పించాం: మంత్రి

Posted On: 27 OCT 2025 12:28PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో 21 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా లొంగిపోవడంపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు: ‘‘ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలో 21 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా లొంగిపోయారన్న సంగతిని మీతో పంచుకొనేందుకు సంతోషిస్తున్నాను. వారిలో 13 మంది సీనియర్ స్థాయికి  చెందిన వారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని వారు హింసామార్గాన్ని విడిచి, ప్రధాన స్రవంతిలో చేరినందుకు వారిని నేను ప్రశంసిస్తున్నాను. తుపాకులు పట్టుకు తిరుగుతున్న మిగతా వారు కూడా సాధ్యమైనంత త్వరగా లొంగిపోవాల్సిందిగా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నక్సలిజాన్ని 2026 మార్చి నెలాఖరు నాటికి నామరూపాలు లేకుండా చేయాలని మేం సంకల్సం చెప్పుకొన్నాం.’’

 

***


(Release ID: 2183089) Visitor Counter : 5