ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సతీష్ షా మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 OCT 2025 7:44PM by PIB Hyderabad

ఈ రోజు ప్రముఖ నటుడు శ్రీ సతీష్ షా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. భారతీయ వినోదానికి ఆయనొక నిజమైన దిగ్గజమని ప్రధాని అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“శ్రీ సతీష్ షా గారి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారతీయ వినోదానికి నిజమైన దిగ్గజంగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన సహజమైన హాస్యం, అద్భుతమైన ప్రదర్శనలు ఎంతో మంది జీవితాల్లో నవ్వులను నింపాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.”


(रिलीज़ आईडी: 2182551) आगंतुक पटल : 39
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam