ప్రధాన మంత్రి కార్యాలయం
ఐటీబీపీ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
24 OCT 2025 7:49PM by PIB Hyderabad
ఐటీబీపీ( ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హిమవీరులందరితో పాటు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ భద్రతా దళం దేశానికి ఎంతో సేవ చేసిందన్న ఆయన.. ధైర్యం, క్రమశిక్షణ, విధి పట్ల వారు చూపించే అచంచలమైన నిబద్ధతను ప్రశంసించారు. విపత్తు సహయక, ఉపశమన మిషన్ల విషయంలో సంసిద్ధతతో ఉండే తీరు, చూపించే కరుణను కూడా మెచ్చుకున్న మోదీ.. ఇవి వారి అత్యుత్తమ సేవా, మానవత్వ స్ఫూర్తిని తెలియజేస్తున్నాయన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఐటీబీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హిమవీరులందరితో పాటు వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భద్రతా దళం అసమానమైన ధైర్యం, క్రమశిక్షణ, విధి పట్ల అంకితభావాన్ని కలిగి ఉంది. అత్యంత కఠినమైన వాతావరణం, అత్యంత క్లిష్ట భూభాగాల్లో సేవలందిస్తోన్న వారు.. అచంచలమైన సంకల్పంతో దేశాన్ని రక్షిస్తున్నారు. విపత్తు సహాయక, ఉపశమన మిషన్ల సమయంలో సంసిద్ధతతో ఉండే తీరు, వారు చూపించే కరుణ.. సేవ, మానవత్వానికి సంబంధించిన అత్యున్నత స్ఫూర్తిని తెలియజేస్తోంది."
@ITBP_official”
***
MJPS/SR
(Release ID: 2182337)
Visitor Counter : 17
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada