ప్రధాన మంత్రి కార్యాలయం
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభం.. ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
14 OCT 2025 2:30PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం తొణికిసలాడుతూ ఉండే విశాఖపట్నం నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా అనేక వసతులకు నిలయమైన ఈ కేంద్రం.. ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణంతో సరిపోలేదిగా ఉందని శ్రీ మోదీ అన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ప్రభావవంతమైన శక్తిగా నిలుస్తుంది. ఇది ఏఐని అందరి చెంతకు చేరుస్తూ, మన ప్రజలకు ఆధునిక సేవలను సమకూరుస్తూ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శి భారత్ అనే హోదాను కూడా ఇస్తుంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం తొణికిసలాడుతూ ఉండే విశాఖపట్నం నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నాను.
గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా అనేక వసతుల నిలయమైన ఈ కేంద్రం.. ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణంతో సరిపోలేదిగా ఉంది. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ప్రభావవంతమైన శక్తిగా నిలుస్తుంది.ఇది ఏఐని అందరి చెంతకు చేరుస్తూ, మన ప్రజలకు ఆధునిక సేవలను సమకూరుస్తూ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శి భారత్ అనే హోదాను కూడా ఇస్తుంది.’’
@sundarpichai
(रिलीज़ आईडी: 2181849)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam