రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణికుల రాకపోకలపై రైల్వే బోర్డు వార్ రూమ్ వద్ద సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్..
24x7 పనిచేస్తున్న సిబ్బందికి అభినందన, దీపావళి శుభాకాంక్షలు
అక్టోబర్ 1 - 19 మధ్య ప్రత్యేక రైళ్లలో కోటి మందికి పైగా ప్రయాణాన్ని సులభతరం చేసిన భారతీయ రైల్వే.. ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక ప్రాంతాలు, అదనపు టికెట్ కౌంటర్లు, శుభ్రమైన టాయిలెట్లు, తాగునీటి సదుపాయాల ద్వారా క్రమబద్ధంగా రద్దీ నిర్వహణ
పండుగ వేళ ప్రయాణ అవసరాలను తీర్చేందుకు అక్టోబరు 1 - 19 మధ్య 3,960 ప్రత్యేక రైళ్లను నడిపిన భారతీయ రైల్వే.. దీపావళి, ఛఠ్ రద్దీకి అనుగుణంగా మరో 8,051 ప్రత్యేక రైళ్లు
అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లతో పండగ సేవల్లో ముందున్న ఉత్తర (1919), మధ్య (1998), పశ్చిమ రైల్వేలు
Posted On:
20 OCT 2025 2:16PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు రైల్వే బోర్డు వద్ద ఉన్న వార్ రూమును సందర్శించి, పండుగ వేళ ప్రయాణికుల రాకపోకలపై సమీక్షించారు. 24 గంటలూ పనిచేసిన సిబ్బందిని అభినందించిన ఆయన.. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుత పండుగ వేళ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, అందుకు తగిన విధంగా భారతీయ రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. పూజ, దీపావళి, ఛఠ్ సమయంలో ప్రయాణం సజావుగా సాగేలా చూడడం కోసం.. భారతీయ రైల్వే 12,011 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గతేడాది ఈ సమయంలో నడిపిన 7,724 రైళ్లతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రస్తుత పండగ రద్దీలో ప్రయాణికులకు సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం భారతీయ రైల్వే పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేస్తోంది. సాధారణ రైలు సేవలతోపాటు పండుగ వేళ పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు తగినట్టుగా 2025 అక్టోబరు 1 - 19 మధ్య భారతీయ రైల్వే 3,960 ప్రత్యేక రైళ్లను విజయవంతంగా నడిపింది.
దీపావళి, ఛఠ్ కోసం ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. రాబోయే రోజుల్లో మరో 8,000 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.
భారతీయ రైల్వేలోని అన్ని జోన్లలో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఉత్తర రైల్వే (1919 రైళ్లు), మధ్య రైల్వే (1998 రైళ్లు), పశ్చిమ రైల్వే (1501 రైళ్లు) అత్యధిక సంఖ్యలో రైళ్లను నడుపుతున్నాయి. తూర్పు మధ్య రైల్వే (1217), వాయువ్య రైల్వే (1217) సహా ఇతర జోన్లు కూడా ఆయా ప్రాంతాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా అదనపు సేవలను అందిస్తున్నాయి. జోన్ల వారీగా ఈ 12,011 రైళ్లు కింద పేర్కొన్న విధంగా నడుస్తున్నాయి:
Zone
|
No of Specials
|
CR
|
1998
|
ECOR
|
367
|
ECR
|
1217
|
ER
|
310
|
KR
|
3
|
NCR
|
438
|
NER
|
442
|
NFR
|
427
|
NR
|
1919
|
NWR
|
1217
|
SCR
|
973
|
SECR
|
106
|
SER
|
140
|
SR
|
527
|
SWR
|
325
|
WCR
|
101
|
WR
|
1501
|
Grand Total
|
12011
|
2025లో పండుగల సందర్భంగా ప్రకటించిన రైళ్ల జాబితా:
2025 అక్టోబరు 1 – అక్టోబరు 19 మధ్య ఈ ప్రత్యేక సేవల ద్వారా ఇప్పటికే కోటి మందికి పైగా ప్రయాణికులు సదుపాయాలను పొందారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక ప్రాంతాలు, అదనపు టికెట్ కౌంటర్లు, తాగునీటి ఏర్పాట్లు, శుభ్రమైన టాయిలెట్లను ఏర్పాటు చేసి స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను క్రమబద్ధంగా నిర్వహించారు. తద్వారా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించారు.
న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, షాకూర్ బస్తీ స్టేషన్లున్న న్యూఢిల్లీ ప్రాంతంలో 2025 అక్టోబర్ 16 నుంచి 19 మధ్య మొత్తం 15.17 లక్షల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంలో 13.66 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 1.51 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు.
అంతకుముందు న్యూఢిల్లీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలోనూ సందర్శించిన కేంద్ర మంత్రి.. ప్రయాణికులతో మాట్లాడి, వారి కోసం భారతీయ రైల్వే చేసిన ఏర్పాట్లపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రయాణికుల రాకపోకలను సజావుగా నిర్వహించడం కోసం ప్రత్యేకంగా వేచి ఉండే ప్రాంతాలు, అదనపు టికెట్ కౌంటర్లు, తాగునీటి ఏర్పాట్లు, రైళ్ల సమయాన్ని ప్రదర్శించడం, తదితర సౌకర్యాలను కల్పించారు.
పండగ రద్దీ సమయంలో ప్రయాణికులందరికీ సురక్షిత, సౌకర్యవంతమైన, అవాంతరాల్లేని ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉంది. కార్యకలాపాల సమర్థ నిర్వహణ, ప్రతి ప్రయాణికుడికీ ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం 12 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులు నిరంతరం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
****
(Release ID: 2181396)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam