ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీలంక ప్రధాని భేటీ


ఆమె పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందన్న శ్రీ నరేంద్ర మోదీ

ఈ ఏడాది ఏప్రిల్‌లో తన శ్రీలంక పర్యటనను... అధ్యక్షుడు దిసనాయకేతో ఫలవంతమైన చర్చలనూ గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ

విద్య, సాంకేతికత, ఆవిష్కరణల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంలో సహకారాన్ని బలోపేతం చేసే చర్యలపై చర్చించిన ఇరువురు నేతలు

ఇరుదేశాల సమష్టి అభివృద్ధి ప్రయాణంలో కలిసి పనిచేయడం పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

అధ్యక్షుడు దిసనాయకేకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ మోదీ - నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని వ్యాఖ్య

Posted On: 17 OCT 2025 4:25PM by PIB Hyderabad

శ్రీలంక డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవనీయ డాక్టర్ హరిణి అమరసూర్య ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఆమెకు సాదర స్వాగతం పలికిన ప్రధానమంత్రి.. ఆమె పర్యటన చరిత్రాత్మకమైన, బహుముఖమైన భారత్-శ్రీలంక సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని తెలియజేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంకలో తన అధికారిక పర్యటన సందర్భంగా పరస్పర సహకారానికి సంబంధించిన అన్ని రంగాలను ప్రస్తావిస్తూ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో జరిగిన ఫలవంతమైన చర్చలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.

విద్య, సాంకేతికత, ఆవిష్కరణ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి తీసుకునే చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు.

భారత్ - శ్రీలంక మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ఇరు దేశాల సమష్టి అభివృద్ధి ప్రయాణంలో కలిసి పనిచేయడం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

అధ్యక్షుడు దిసనాయకేకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి... వారి నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. 

 

***


(Release ID: 2180414) Visitor Counter : 21