ప్రధాన మంత్రి కార్యాలయం
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో పురోగతి...
ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహూకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
09 OCT 2025 10:17PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక సజావుగా ముందుకు వెళ్లడంపై శ్రీ నెతన్యాహూకు అభినందనలు తెలిపారు.
బందీలను విడుదల చేయడంతో పాటు గాజా ప్రజలకు మరింత మానవతా సాయాన్ని అందించడంపైనా ఒప్పందం కుదరడాన్ని శ్రీ మోదీ స్వాగతించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘నా స్నేహితుడు ప్రధానమంత్రి శ్రీ నెతన్యాహూతో మాట్లాడాను.. గాజాలో శాంతి స్థాపనకు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళిక సజావుగా ముందుకు సాగుతున్నందుకు శ్రీ నెతన్యాహూకు అభినందనలు తెలియజేశాను. బందీల విడుదలపైనా, గాజా ప్రజానీకానికి ఇది వరకటితో పోలిస్తే మరింత మానవతా సాయం అందించే దిశగా కుదిరిన ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఏ రూపంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, తీవ్రవాదం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాను’’.
(रिलीज़ आईडी: 2177488)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam