ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పరిధిలో పీఎస్‌బీల ద్వారా 5 లక్షలకు పైగా దరఖాస్తులకు రూ.10,907 కోట్ల రుణం మంజూరు


సహ దరఖాస్తుదారులను చేర్చడం, సామర్థ్య ఆధారిత పరిమితులను తొలగించడం లాంటి సవరణలతో పెరిగిన పథకం విస్తృతి

Posted On: 07 OCT 2025 4:22PM by PIB Hyderabad

స్వచ్ఛమైనచౌకగా లభించే సౌర విద్యుత్‌ను ఇళ్లకు అందించడంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్‌జీఎంబీవైగణనీయమైన విజయాన్ని సాధించింది. 2025 సెప్టెంబర్ నాటికి, 5.79 లక్షలకు పైగా దరఖాస్తులకు రూ.10,907 కోట్ల రుణాలను మంజూరు చేసి ఇంటి పై కప్పుపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించాయి.

మూలంజన్ సమ్మర్థ్ పోర్టల్

రుణాల మంజూరు విధానాన్ని క్రమబద్దీకరించడం, తక్కువ వడ్డీ రేట్లకు హామీ రహిత రుణాలు అందించడంపీఎస్‌బీల ద్వారా రుణాలను సరళీకరించడం ద్వారా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్‌జీఎంబీవైచురుగ్గా అమలవుతోందిపీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జాతీయ పోర్టల్ (pmsuryaghar.gov.in)తో అనుసంధానమైన జన సమ్మర్థ్ పోర్టల్ ద్వారా ఈ రుణాలు మంజూరవుతాయిఇది డిజిటల్ అప్లికేషన్ల ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికివినియోగదారులకు మెరుగైన అనుభవంలబ్ధిదారులకు సమాచార ఆధారిత నిర్ణయం తీసుకునే వీలును అందిస్తాయి.

తక్కువ వడ్డీకిరూ.2 లక్షల వరకు హామీ రహిత రుణాలను అందించడంవిద్యుత్ ఆదాకు అనుగుణంగా అప్పును తిరిగి చెల్లించేందుకు దీర్ఘకాల పరిమితిమంజూరైనప్పటి నుంచి నెలల రుణ విరామందరఖాస్తుదారుపై తక్కువ వ్యయ భారంస్వీయ ధ్రువీకరణ ద్వారా డిజిటల్ మంజూరు ప్రక్రియ తదితరమైన ప్రయోజనాలను ఈ పథకం అందిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న క్రియాశీలక భాగస్వామ్యంతో పాటు.. ఎక్కువ మందికి రుణాలు అందించడానికీపథకాన్ని మరింత విస్తరించడానికి వీలుగా అనేక సవరణలు చేశారువాటిలో అర్హత పరిధిని మెరుగుపరిచేందుకు సహ దరఖాస్తుదారులను చేర్చడంసామర్థ్య ఆధారిత పరిమితులను తొలగించడంఅవసరమైన పత్రాలను సరళీకరించడం తదితరమైనవి ఉన్నాయివీటిని వినియోగదారుల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా అమలు చేశారు.

ఈ పథకం పరిధిలో ఇచ్చిన రుణాల ప్రగతిని నూతనపునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్థిక సేవల విభాగం సమీక్షిస్తుందిఅలాగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలులీడ్ జిల్లా మేనేజర్లు సహకారంతో అమలు తీరును బలోపేతం చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ పథకం చేరువ అవుతోంది.

 

***


(Release ID: 2176302) Visitor Counter : 11