ప్రధాన మంత్రి కార్యాలయం
వి.కె. మల్హోత్రా జీవితం, సేవలపై తన భావాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 OCT 2025 10:03AM by PIB Hyderabad
సీనియర్ నేత వి.కె. మల్హోత్రాను గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన భావాలను ఈ రోజు ఒక వ్యాసం రూపంలో ప్రజలతో పంచుకున్నారు. మల్హోత్రా గారి జీవితం, ఆయన అందించిన సేవలపై తన భావాలను శ్రీ మోదీ వివరించారు.
వి.కె. మల్హోత్రా గారి వారసత్వం దశాబ్దాల తరబడి ప్రజా సేవలోనూ, సిద్ధాంత పరమైన నిబద్ధతలోనూ, వివిధ రంగాల్లో దేశ నిర్మాణంలో ప్రతిబింబించిందని శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘శ్రీ వి.కె. మల్హోత్రా గారి జీవితం, ఆయన చేసిన కృషి, మా పార్టీ సిద్ధాంతాల ఆచరణకు ఆయన ఎంతగా పాటుపడిందీ వీటికి సంబంధించిన నా భావాలకు అక్షర రూపాన్నిచ్చాను. రాజకీయాలు, పార్లమెంటు నుంచి సేవ, క్రీడల వరకు విభిన్న రంగాలపై ఆయన ప్రభావం ఉంది’’
(रिलीज़ आईडी: 2175239)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam