ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
02 OCT 2025 11:36PM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరిచింది:
‘‘మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో జరిగిన దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం విచారకరం. బాధితులకు, వారి కుటుంబాలకు కలిగిన దు:ఖంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. గాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’
(Release ID: 2174349)
Visitor Counter : 3