ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిలిప్పీన్స్ భూకంప మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
Posted On:
01 OCT 2025 3:23PM by PIB Hyderabad
ఫిలిప్పీన్స్‌లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, విస్తృత ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఫిలిప్పీన్స్‌కు భారత్ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఫిలిప్పీన్స్‌లో భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం, విస్తృత ఆస్తి నష్టం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. నా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఫిలిప్పీన్స్‌కు భారత్ అండగా ఉంటుంది.
@bongbongmarcos”
(Release ID: 2173943)
Visitor Counter : 4