ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
అస్సాంలో ఎన్ హెచ్ -715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్ రహదారిని
4 లైన్లుగా వెడల్పు చేయడానికి, మెరుగుపరచడానికి క్యాబినెట్ ఆమోదం
ప్రాజెక్టులో భాగంగా కాజీరంగా జాతీయ పార్క్ (కేఎన్పీ) మార్గంలో వన్యప్రాణుల సంరక్షణ
క్యారేజ్‌వే మొత్తం పొడవు 85.675 కిలోమీటర్లు...ఆర్థిక వ్యయం రూ. 6957 కోట్లు
Posted On:
01 OCT 2025 3:26PM by PIB Hyderabad
అస్సాంలో కాజీరంగా జాతీయ పార్కు (కేఎన్పీ) మార్గంలో ప్రతిపాదించిన వన్యప్రాణుల సంరక్షణ చర్యలను అమలు చేయడంతో సహా, జాతీయ రహదారి 715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్ రహదారిని నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి, మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీపీ) పద్ధతిలో మొత్తం 85.675 కిలోమీటర్ల పొడవున రూ 6957 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.
ప్రస్తుతం ఎన్ హెచ్ - 715 (పాత ఎన్ హెచ్ -37) లోని కాలీబోర్ - నుమాలిగఢ్ మార్గం రెండు లైన్లుగా జఖలాబంధ (నాగావ్), బోకాఖత్ (గోలాఘాట్) పట్టణాలలోని ప్రాంతాలను కలుపుతోంది. ఇందులో కొంతభాగం పేవ్ మెంట్ తోను, కొంతభాగం పేవ్ మెంట్ లేకుండా ఉంది. ప్రస్తుత రహదారిలో అధిక భాగం కాజీరంగా జాతీయ పార్క్ మీదుగా లేదా పార్క్ దక్షిణ సరిహద్దు వెంబడి వెళుతుంది. దీనికి 16 నుంచి 32 మీటర్ల పరిమిత రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యు) ఉంది. దీనికి తోడు రోడ్డు నిర్మాణ లోపాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. వర్షాకాలంలో, పార్కు లోపలి ప్రాంతం ముంపునకు గురవుతోంది. దీనివల్ల వన్యప్రాణులు పార్కు నుంచి ఎత్తయిన కర్బీ-ఆంగ్లాంగ్ కొండల వైపు వెళ్లడానికి ప్రస్తుత రహదారిని దాటాలి. అయితే, రహదారిపై రాత్రింబవళ్లు ఉండే భారీ ట్రాఫిక్ కారణంగా, వన్యప్రాణులు తరచుగా ప్రమాదాలకు గురై మరణిస్తున్నాయి.
ఈ సవాళ్లను పరిష్కరించడానికి, ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కాజీరంగా జాతీయ పార్క్ నుంచి కర్బీ - ఆంగ్లాంగ్ కొండల వరకు వన్యప్రాణులకు అడ్డంకుల్లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు దాదాపు 34.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇప్పటికే ఉన్న 30.22 కిలోమీటర్ల రహదారిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జఖలాబంధ, బోకాఖత్ చుట్టూ 21 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ బైపాస్‌లను కూడా నిర్మిస్తారు. ఇది కారిడార్ లో రద్దీని తగ్గిస్తుంది. భద్రతను మెరుగుపరుస్తుంది. గౌహతి (రాష్ట్ర రాజధాని), కాజీరంగా జాతీయ పార్క్ (పర్యాటక ప్రదేశం), నుమాలిగఢ్ (పారిశ్రామిక పట్టణం) మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది.
ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ 2 ప్రధాన జాతీయ రహదారులు (ఎన్ హెచ్-127, ఎన్ హెచ్ -129), ఒక రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్ - 35 )తో అనుసంధానమై అస్సాం అంతటా కీలక ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు నిరంతర అనుసంధానాన్ని అందిస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన కారిడార్ 3 రైల్వే స్టేషన్లు (నాగావ్, జఖలబంధ, విశ్వనాథ్ చార్లీ), 3 విమానాశ్రయాలు (తేజ్‌పూర్, లియాబరి, జోర్హాట్) లతో అనుసంధానం కావడం ద్వారా మల్టీమోడల్ సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఈ ప్రాంతమంతటా వస్తువుల, ప్రయాణికుల వేగవంతమైన రాకపోకల్ని సులభతరం చేస్తుంది. ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ రెండు సామాజిక, ఆర్థిక కేంద్రాలు, నోడ్లు, 8 పర్యాటక, మతపరమైన ప్రదేశాలకు రాకపోకలను మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, కాలీబోర్ - నుమాలిగఢ్ విభాగం ప్రాంతీయ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన పర్యాటక, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. కజిరంగా జాతీయ పార్క్‌కు పర్యాటకాన్ని పెంచుతుంది. వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ సుమారు 15.42 లక్షల పనిదినాల ప్రత్యక్ష, 19.19 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధిని కూడా సృష్టిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలలో పెరుగుదల, అభివృద్ధి, అభివృద్ధి, సౌభాగ్యానికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
ప్రత్యేకత
|
వివరాలు
|
ప్రాజెక్ట్ పేరు
|
అస్సాంలోని కాజీరంగా జాతీయ పార్క్ పరిధిలో ప్రతిపాదిత వన్యప్రాణి స్నేహపూర్వక చర్యల అమలుతో సహా 4 లైన్లుగా
ఎన్ హెచ్-715 కాలీబోర్ - నుమాలిగఢ్ మార్గం విస్తరణ
|
కారిడార్
|
ఎన్ హెచ్-715
|
పొడవు (కిమీ)
|
85.675
|
కాజీరంగా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే ఎలివేటెడ్ కారిడార్ పొడవు
|
34.45 కిలోమీటర్లు
|
బై పాస్ రహదారులు
|
పుదుచ్చేరి బై పాస్ (గ్రీన్ ఫీల్డ్) -11.5 కిలోమీటర్లు
బొకాఖత్ బై పాస్ (గ్రీన్ ఫీల్డ్) - 9.5 కిలోమీటర్లు
|
ప్రస్తుత రహదారి (2 నుంచి 4 లైన్లకు) వెడల్పు
|
30.22 కిలోమీటర్లు
|
మొత్తం సివిల్ వ్యయం (రూ.కోట్లు)
|
4,829
|
భూ సేకరణవ్యయం (రూ. కోట్లు)
|
622
|
మొత్తం పెట్టుబడి వ్యయం ( రూ. కోట్లు
|
6,957
|
నిర్మాణ విధానం
|
ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీపీ)
|
అనుసంధానించే ప్రధాన రోడ్లు
|
జాతీయ రహదారులు – ఎన్ హెచ్-127, ఎన్ హెచ్-129
రాష్ట్ర రహదారులు - ఎస్ హెచ్-35
|
అనుసంధానమయ్యే ఆర్థిక / సామాజిక / రవాణా కేంద్రాలు/ పర్యాటక ప్రదేశాలు/ ఆధ్యాత్మిక ప్రదేశాలు
|
విమానాశ్రయాలు: తేజ్‌పూర్, లియాబరి, జోర్హాట్
రైల్వే స్టేషన్లు: నాగావ్, జఖలబంధ, విశ్వనాథ్ చార్లీ
ఆర్థిక కేంద్రాలు: తేజ్‌పూర్ చేపల క్లస్టర్, నాగావ్ చేపల క్లస్టర్
సామాజిక కేంద్రాలు: కర్బీ ఆంగ్లాంగ్ (గిరిజన జిల్లా) ట్రైబల్ వొఖా (గిరిజన జిల్లా)
పర్యాటక ప్రదేశాలు: కాజీరంగా జాతీయ పార్క్, దియోఫర్ ఆర్కియలాజికల్ ప్రదేశం - నుమాలీ ఘడ్ ,కకోచాంగ్ వాటర్ ఫాల్
ఆధ్యాత్మిక ప్రదేశాలు: బాబా థాన్ (శ్రీ శివాలయం) – నుమాలిగఢ్, మహా మృత్యుంజయ దేవాలయం – నాగావన్, హతీమురా దేవాలయం – నాగావ్
|
. అనుసంధానమయ్యే ప్రధాన నగరాలు/ పట్టణాలు
|
గౌహతి, నాగావ్, గోలాఘాట్, నుమాలిగఢ్, జోర్హాట్
|
ఉపాధి కల్పన సామర్ధ్యం
|
15.42 లక్షల పనిదినాలు (ప్రత్యక్ష),
19.19 లక్షల పనిదినాలు (పరోక్ష)
|
2025 ఆర్థిక సంవత్సరంలో సగటు రోజువారీ ట్రాఫిక్ (ఏఏడీటీ)
|
13,800 ప్రయాణికుల కార్ల యూనిట్లు (పీసీయూ)
|
***
(Release ID: 2173823)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam