ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2025ను స్వాగతించిన ప్రధానమంత్రి

Posted On: 27 SEP 2025 6:03PM by PIB Hyderabad

ఈ రోజు నుంచి ఢిల్లీలో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2025కు క్రీడాకారులుప్రతినిధులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్వాగతించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

 

"ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2025ను ఢిల్లీలో నిర్వహించటం పట్ల భారతదేశం గర్వంగా ఉందిపాల్గొనే వారందరికీ హృదయపూర్వక స్వాగతంశుభాకాంక్షలుఈ టోర్నమెంట్ మానవ సంకల్పానికీస్ఫూర్తికీ చిహ్నంగా నిలుస్తోందిఈ టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా మరింత సమ్మిళితమైనశక్తిమంతమైన క్రీడా సంస్కృతిని పెంచాలని కోరుకుంటున్నాను"


(Release ID: 2172364) Visitor Counter : 24