ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పదకొండేళ్లు…: ప్రధానమంత్రి

Posted On: 25 SEP 2025 1:01PM by PIB Hyderabad

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ 11వ వార్షికోత్సవం ఈ రోజుఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారుభారత ఆర్థిక వ్యవస్థలోఔత్సాహిక పారిశ్రామికవేత్తల అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఈ కార్యక్రమం గొప్ప మార్పును తీసుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

 
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో మైగవ్ఇండియా పొందుపరిచిన సందేశాలకు శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా రాశారు:

‘‘
భారత వృద్ధికి వేగాన్ని ఇవ్వడంతో పాటు మన దేశంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే తపన ఉన్న వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని 11 సంవత్సరాల కిందట ఇదే రోజున ప్రారంభించాం.


ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్వావలంబనకు పునాది వేయడంలో గత 11 సంవత్సరాలుగా ఈ  కార్యక్రమం ఎంతగా తోడ్పడిందీ చూస్తే సంతోషంగా ఉందిఈ కార్యక్రమం అన్ని రంగాల్లో నవకల్పననూఉద్యోగావకాశాలనూ ప్రోత్సహించింది.

మన దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉత్తేజాన్నిచ్చింది మేక్ ఇన్ ఇండియాదీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపించింది.

#11YearsOfMakeInIndia"


(Release ID: 2171116) Visitor Counter : 18