మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే వికసిత్ భారత్ బిల్డథాన్-2025ను ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. స్వయం-సమృద్ధ భారత్ సాకారం కోసం

యువ ఆవిష్కర్తలను శక్తిమంతం చేసేందుకే భారత్ బిల్డథాన్-2025

ఫలితాల ప్రకటన.. 1,000 మందికి పైగా విజేతల సత్కారాలతో

2026 జనవరిలో బిల్డథాన్ ముగింపు

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2025 5:25PM by PIB Hyderabad

కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు వికసిత్ భారత్ బిల్డథాన్ 2025ను ప్రారంభించారుఇది దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రూపొందించిన ఒక సంచలనాత్మక ఆవిష్కరణ ఉద్యమంపాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం (డీవోఎస్ఈఎల్), అటల్ ఇన్నోవేషన్ మిషన్నీతి ఆయోగ్ఏఐసీటీఈల సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ‘వికసిత్ భారత్ బిల్డథాన్ 2025’ నిర్వహిస్తోందిఈ ప్రారంభ కార్యక్రమంలో వికసిత్ భారత్ బిల్డథాన్ జింగిల్లోగోను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.

పాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజాఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీ జీ సీతారాంవైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ జెరెనీతి ఆయోగ్ ఏఐఎమ్ మిషన్ డైరెక్టర్ శ్రీ దీపక్ బాగ్లాపాఠశాల విద్య-అక్షరాస్యత శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ధీరజ్ సాహుమంత్రిత్వ శాఖకేవీఎస్ఎన్‌వీఎస్‌లకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అతిపెద్ద పాఠశాల హ్యాకథాన్ అయిన వికసిత్ భారత్ బిల్డథాన్.. విద్యార్థులు 'వోకల్ ఫర్ లోకల్ఆత్మనిర్భర్ భారత్స్వదేశీసమృద్ధిఅనే నాలుగు ఇతివృత్తాలపై ఆలోచనలనుఉత్పత్తులను రూపొందించేలా ప్రోత్సహించడం ద్వారా కింది స్థాయి నుంచి ఆవిష్కరణల సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందన్నారుఈ కార్యక్రమం విద్యార్థుల ఆవిష్కరణలను గుర్తింపునివ్వడంతోపాటు దేశంలో ఆవిష్కరణల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారుసమృద్ధివికసిత్ఆత్మనిర్భర్ భారత్‌కు యువతరం కీలక చోదక శక్తిగా మారేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

బిల్డథాన్ కోసం సన్నద్ధతను.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ సమగ్ర వివరించారు.

దేశాభివృద్ధి కోసం సృజనాత్మక ఆలోచనలనుస్వయం-సమృద్ధినిసుస్థిర వృద్ధిని ప్రోత్సహించడంపాఠశాలలను సమకాలీన ఆవిష్కరణల్లో భాగస్వామ్యం చేయడంసంభావ్య ప్రపంచ రికార్డు ద్వారా దేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల రాజధానిగా ముందుకు నడపడంజాతీయ-అంతర్జాతీయ వేదికలపై సమస్య పరిష్కార నైపుణ్యాలు గల యువతను గౌరవించడం బిల్డథాన్ లక్ష్యంఅటల్ టింకరింగ్ ల్యాబ్స్ పేటెంట్లుఅంకురసంస్థల వెంచర్‌లతో పాటు స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ (ఎస్ఐపీ)స్టూడెంట్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్ఈపీవంటి కార్యక్రమాలకు దారితీసిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2024 విజయం ప్రాతిపదికన ఈ బిల్డథాన్‌ను రూపొందించారు.

వికసిత్ భారత్ బిల్డథాన్ ప్రయాణం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు వికసిత్ భారత్ బిల్డథాన్ పోర్టల్ (https://vbb.mic.gov.in/)లో నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ వరకు అవకాశం ఉంటుందిదీని తర్వాత అక్టోబర్ నుంచి అక్టోబర్ 13 వరకు పాఠశాలల సన్నాహక కాలం ఉంటుందిఈ సన్నాహకాల్లో భాగంగా పోర్టల్‌లో నమోదు చేసుకునే ప్రక్రియ గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తారుఆ తర్వాత విద్యార్థులు తమ ఆలోచనలనునమూనాలను పోర్టల్‌లో సమర్పిస్తారుబిల్డథాన్‌లో ప్రధాన అంశమైన లైవ్ సింక్రొనైజ్డ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 13న నిర్వహిస్తారుఈ కార్యక్రమం తర్వాత విద్యార్థులు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 31 వరకు తమ తుది ఎంట్రీలను సమర్పిస్తారుఈ సమర్పణలను నిపుణుల బృందం నవంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు రెండు నెలల కాలంలో మూల్యాంకనం చేస్తుంది. 2026 జనవరిలో ఫలితాల ప్రకటనటాప్ 1,000+ విజేతల సత్కారంతో ఈ బిల్డథాన్ ముగుస్తుంది.

వికసిత్ భారత్ బిల్డథాన్-2025 ఇతివృత్తాలులక్ష్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక వీడియోను ప్రదర్శించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2170558) సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Kannada , Malayalam