ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రకవి రాంధారి సింగ్ దినకర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
Posted On:
23 SEP 2025 5:59PM by PIB Hyderabad
రాష్ట్రకవి రాంధారి సింగ్ దినకర్ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు మనఃపూర్వక నివాళి అర్పించారు. భారతీయ సాహిత్యానికి, దేశ జాగరూకత కోసం ఆయన అందించిన చిరస్మరణీయమైన సేవలను స్మరించుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“రాష్ట్రకవి రాంధారి సింగ్ దినకర్ జయంతి సందర్భంగా ఆయనకు కోటి ప్రమాణాలు. ఆయన కవితలు బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించాయి. ఆయన కవితా పంక్తులు అనేకం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకున్నాయి. వీరత్వం, మానవత్వం నిండిన శక్తిమంతమైన, చిరస్మరణీయమైన ఆయన రచనలు.. భరతమాత సేవలో లీనమయ్యేలా తరతరాలకూ ప్రేరణనిస్తూనే ఉంటాయి.”
(Release ID: 2170546)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam